న్యూఢిల్లీ: కెనడా విషయంలో భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్నీ స్పష్టం చేస్తూ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత్ దేశం ఎప్పుడూ రాజీ పడదని రాశారు.
భారతదేశం తీవ్రవాదిగా ముద్ర వేసిన ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా వైఖరిపై భారత్ దీటుగా స్పందించింది. కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించిన నేపథ్యంలో భారత్ లోని కెనడా హైకమిషనర్ ని కూడా బహిష్కరించి ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
కానీ కెనడా ప్రధాని తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌పై నిందలు వేస్తున్నారని వాస్తవానికి కెనడా ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని అణచడంలో విఫలమైందని ఫలితంగా ఖలిస్తానీ మద్దతుదారులు కెనడాలో ఉంటూనే భారత్‌లో హింసాకాండలకు పాల్పడుతున్నారని భారత ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.
ఈ విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 'ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ విశ్వసిస్తోందని ముఖ్యంగా ఉగ్రవాదం భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగిస్తుంది కాబట్టి దేశ ప్రయోజనాలకే ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వాలి' అని రాశారు
भारतीय राष्ट्रीय कांग्रेस का हमेशा से मानना रहा है कि आतंकवाद के ख़िलाफ़ हमारे देश की लड़ाई में किसी भी तरह का कोई समझौता नहीं होना चाहिए। विशेष रूप से तब जब आतंकवाद से भारत की संप्रभुता, एकता और अखंडता को ख़तरा हो। हमारे देश के हितों और चिंताओं को हमेशा सर्वोपरि रखा जाना चाहिए।…
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 19, 2023
ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది నిజ్జర్‌ను విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ హత్య తరువాత ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారతదేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు.
ఖలిస్థాన్ వేర్పాటువాదంపైనా, భారత వ్యతిరేక కార్యకలాపాలపైనా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం అనేకమార్లు కెనడా ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు జీ20 సదస్సు సమయంలో కూడా కెనడా ప్రధానికి భారత ప్రధాని ఈ విషయంపై మందలించారు. దాని పర్యవసానమే భారత దౌత్యాధికారి బహిష్కరణ. భారత ప్రభుత్వం కూడా దీటుగా స్పందించడంతో కెనడా ఇరకాటంలో పడింది.
ఇది కూడా చదవండి: కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి..
Comments
Please login to add a commentAdd a comment