వాషింగ్టన్ డీసీ : కెనడా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఎక్స్ యూజర్.. జస్టిన్ ట్రూడో ఓడించేందుకు సహయం చేస్తారా అని ఎలాన్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై మస్క్ స్పందిస్తూ.. రాబోయే ఎన్నికలలో ట్రూడో ఓడిపోతారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కెనడా ప్రధాని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరుఫున పియరీ పొయిలీవ్రే, న్యూ డెమోక్రటిక్ పార్టీ నుంచి జగ్మీత్ సింగ్‌నుంచి ట్రూడో కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ఫలితంగా ట్రూడో అధికారాన్ని కోల్పోనున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ విశ్లేషణలపై ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ స్పందించారు. కాగా, మస్క్ గతంలో ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్రీ స్పీచ్‌పై కెనడా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని ఖండించారు.ప్రత్యేకించి ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలు నమోదు చేసుకోవాల్సిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకించారు.
Does this mean @elonmusk is going to help get rid of @JustinTrudeau in the next election?
Huge news if so!
Make Canada Great Again 🇺🇸🇨🇦 pic.twitter.com/D3VxISlLNF— Bret 🍁 (@Bret_Sears) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment