prime minister election
-
కెనడా ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఓటమి ఖాయం
వాషింగ్టన్ డీసీ : కెనడా అధ్యక్ష ఎన్నికలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో ఓడిపోతారని వ్యాఖ్యానించారు.వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఎక్స్ యూజర్.. జస్టిన్ ట్రూడో ఓడించేందుకు సహయం చేస్తారా అని ఎలాన్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై మస్క్ స్పందిస్తూ.. రాబోయే ఎన్నికలలో ట్రూడో ఓడిపోతారని ట్వీట్లో పేర్కొన్నారు.కెనడా ప్రధాని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరుఫున పియరీ పొయిలీవ్రే, న్యూ డెమోక్రటిక్ పార్టీ నుంచి జగ్మీత్ సింగ్‌నుంచి ట్రూడో కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ఫలితంగా ట్రూడో అధికారాన్ని కోల్పోనున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ విశ్లేషణలపై ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలాన్ మస్క్ స్పందించారు. కాగా, మస్క్ గతంలో ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్రీ స్పీచ్‌పై కెనడా ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని ఖండించారు.ప్రత్యేకించి ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవలు నమోదు చేసుకోవాల్సిన కొత్త నిబంధనల్ని వ్యతిరేకించారు. Does this mean @elonmusk is going to help get rid of @JustinTrudeau in the next election?Huge news if so!Make Canada Great Again 🇺🇸🇨🇦 pic.twitter.com/D3VxISlLNF— Bret 🍁 (@Bret_Sears) November 7, 2024 -
థాయిలాండ్ ప్రధాని పీఠంపై పేటోంగ్టార్న్!
బ్యాంకాక్: థాయిలాండ్ రాజకీయాల్లో షనవత్రల మరో కుటుంబ వారసురాలు ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రంగం సిద్ధమైంది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తరఫున అభ్యరి్థగా నిలబడిన నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర ఓటింగ్‌లో సాధారణ మెజారిటీకి కావాల్సిన 247 ఓట్లను దాటేశారు. దీంతో పేటోంగ్టార్న్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. దీంతో షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రులుగా చేశారు. 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపడుతున్న నేపథ్యంలో థాయిలాండ్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతి పిన్క వయసు్కరాలిగా, రెండో మహిళగా రికార్డ్నెలకొల్పనున్నారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి బుధవారం థాయిలాండ్‌లోని రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం విదితమే. -
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
-
బ్రిటన్ ప్రధానిగా నెగ్గిన లిజ్ ట్రస్
లండన్: ఉత్కంఠ వీడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో లిజ్ ట్రస్(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్ గ్రాహం బ్రాడీ. ట్రస్ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌తో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా ట్రస్ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్ నెగ్గినట్లయ్యింది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది విదేశాంగ మంత్రి అయిన లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకున్నారు. #WATCH | Liz Truss defeats rival Rishi Sunak to become the new Prime Minister of the United Kingdom pic.twitter.com/Xs4q2A2ldu — ANI (@ANI) September 5, 2022 ఇదీ చదవండి: ఆ కౌగిలింత.. తీవ్ర విమర్శలు -
తుది అంకానికి చేరువైన బ్రిటన్ ఎన్నిక ప్రక్రియ
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి, కన్జర్వేటివ్ పార్టీ అధినేతను ఎన్నుకునే కీలక ఎన్నిక ప్రక్రియ తుది అంకానికి చేరువైంది. మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌లమధ్య పోరు చివరి దశకు దగ్గరైంది. సొంత కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యుల మద్దతు కోసం ఇద్దరూ చివరిసారిగా అభ్యర్థించి గురువారం ప్రచారాన్ని ముగించారు. లండన్‌లోని వింబ్లేలో చివరి ప్రచార ప్రసంగం సందర్భంగా సునాక్ తన భార్య, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సునాక్ తండ్రి యశ్వీర్ వైద్యుడు. తల్లి ఉషా ఫార్మసిస్ట్. ‘‘ప్రజాసేవలోకి అడుగుపెట్టేలా వాళ్లు నాకెంతగానో స్ఫూర్తినందించారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటా. సన్మార్గంలో నడిపించి, కష్టపడే తత్వం నేర్పించి, కుటుంబం కోసం శ్రమించే సామర్థ్యాలను అందించారు’’ అన్నారు. అక్షిత ఓ అద్భుతమైన, ప్రేమమయ సతీమణి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తారు. భార్య, తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు దక్కడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఘనమైన దేశంలో సాధించలేనిదంటూ ఏదీ లేదంటూ ముగించారు. బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరగడం, నేరాలు, పన్నులు పైకి ఎగబాకడం, వలస విధానంలో సంస్కరణలు, విదేశాంగ విధానం తదితరాలపై సునాక్, ట్రస్ తమ ప్రాధాన్యాలను పేర్కొంటూ ప్రచార పర్వాన్ని ముగించారు. శుక్రవారం పోలింగ్, సోమవారం ఫలితాలు కన్జర్వటివ్ పార్టీ సభ్యులు శుక్రవారం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం ఐదింటిదాకా పోలింగ్ కొనసాగుతుంది. సోమవారం ఫలితాలను వెల్లడిస్తారు. పలు సర్వేల ప్రకారం సునాక్ కంటే ట్రస్ ఈ రేసులో ముందునట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ఎలిజబెత్ రాణి ఈసారి లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి కాకుండా స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోట నుంచి తదుపరి ప్రధానిని ప్రకటిస్తారు. రాణి ప్రస్తుతం ఈ కోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
Rishi Sunak: చివరి ప్రచార ప్రసంగంలో భావోద్వేగం
లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమం కూడా కోలాహలంగా ముగిసింది. బుధవారం రాత్రి లండన్ వెంబ్లే వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లిజ్ ట్రస్- రిషి సునాక్‌లు పోటాపోటీగా తమ వాగ్దాటిని ప్రదర్శించి.. మెప్పించారు. ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదుగానీ.. ఈ ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్‌కు దక్కిన స్పందన మాత్రం అమోఘంగా ఉంది. ఇక ఈ వేదికగా బ్రిటన్ ప్రజలతో పాటు కుటుంబం కోసం కూడా ఓ భావోద్వేగ ప్రకటన చేశారు అభ్యర్థి రిషి సునాక్. ప్రధాని ఎన్నికల్లో ఉన్న తనకు మద్దతుగా నిలిచినందుకుగానూ తల్లిదండ్రులు, భార్య అక్షతా మూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు రిషి సునాక్. ‘‘ఈ ప్రసంగ వేదిక నాకెంతో ప్రత్యేకం. ప్రజా సేవలోకి రావడానికి నన్ను ప్రేరేపించిన నా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. విలువలు, కఠోర శ్రమ నాకు నేర్పించి.. నాలో నమ్మకాన్ని నింపినందుకు అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. కృషి, నమ్మకం మీ ప్రేమతో మన గొప్ప దేశంలో ఎవరైనా సాధించగలిగే వాటికి పరిమితి లేదన్న విషయాన్ని నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు అని రిషి పేర్కొన్నారు. అలాగే భార్య అక్షతను ఉద్దేశిస్తూ.. నా ఉద్దేశ్యం ఏమిటో మీకు తెలుసు. పద్దెనిమిదేళ్ల కిందట.. హైహీల్స్‌ను వదిలేసి.. తగిలించుకునే బ్యాగుతో పొట్టి పిల్లవాడిని ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞుడుని అంటూ సరదాగా మాట్లాడారాయన. ఇక ప్రసంగ సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నేను చేసిన గొప్ప త్యాగం ఏమిటంటే, నేను గత రెండు సంవత్సరాలుగా భయంకరమైన భర్త, తండ్రిగా బాధ్యతలు నిర్వహించాను అంటూ బదులిచ్చారు. ఇదేం కష్టమైన విషయమా? అని అనిపించొచ్చు. కానీ, ఇది నాకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను నా భార్యాపిల్లలకు ఎక్కువ ప్రేమను పంచలేకపోయాను. దురదృష్టవశాత్తు, గత కొన్ని సంవత్సరాలుగా నేను వాళ్ల జీవితాల్లో నేను ఇష్టపడేంతగా ఉండలేకపోయాను అని చెప్పుకొచ్చారు రిషి సునాక్. నేను ప్రజలు వినాలనుకునే విషయాలను చెప్పట్లేదు.. మన దేశం వినాలని నేను నమ్ముతున్న విషయాలను చెప్పాను అని ప్రసంగం చివర్లో రిషి సునాక్ పేర్కొన్నారు. ఈయన ప్రసంగం కొనసాగుతున్నంత సేపు అక్కడ కోలాహలం నెలకొనడం విశేషం. రిషి సునాక్-లిజ్ ట్రస్ ఇంగ్లండ్‌లోని సౌతంప్టన్ భారత సంతతికి చెందిన డాక్టర్(జనరల్ ప్రాక్టీషనర్) యశ్వీర్, తల్లి ఉష ఫార్మసిస్ట్ దంపతులకు జన్మించారు రిషి సునాక్(42). స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివే సమయంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి-సుధా మూర్తి కూతురైన అక్షతాతో పరిచయం ఏర్పడింది. 2009లో రిషి సునాక్-అక్షతా వివాహం జరిగింది. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి ఎవరనేది సోమవారం(సెప్టెంబర్ 5న) తేలనుంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ ల మధ్య మెరుగైన అభ్యర్థిని తేల్చడానికి 1.75 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో శుక్రవారం పాల్గొంటారు. చిత్తశుద్ధితో చెబుతున్నా.. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓ కుటుంబంలా మారదాం, వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిద్దాం. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకెలాంటి సందేహంలేదు. అయితే, మనం నిజాయతీతో, విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. నా వద్ద కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, విలువలతో కూడిన సరైన ప్రణాళిక ఉంది. నేను మొదటి నుంచి స్థిరంగా, చిత్తశుద్ధితో చెబుతున్నాను... మనం ముందు పరిష్కరించాల్సింది ద్రవ్యోల్బణం అంశాన్ని. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమవుతుంది. తక్కువ పన్నులు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, సవ్యమైన ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఫలాల సంపూర్ణ సద్వినియోగం, అభివృద్ధి, సమగ్రతల దిశగా పటిష్ఠ పునాది వేసుకోవడానికి ఇదే మార్గం అని ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇదీ చదవండి: గర్భిణి మృతితో ఆరోగ్యమంత్రి రాజీనామా -
రిషి సునాక్, లిజ్ ట్రస్ వద్దు.. మాకు బోరిస్ కావాలి!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు దగ్గర పడుతున్న వేళ.. కన్జర్వేటివ్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో దూసుకుపోయిన ప్రధాని అభ్యర్థి రిషి సునాక్.. ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో.. ప్రధాని రేసులో తెరపైకి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు వచ్చింది. జాన్సన్‌ను PM రేసు నుండి తొలగించబడకూడదంటూ స్వింగ్ ఓటర్లు పట్టుబడుతున్నారు. అంతేకాదు.. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు లిజ్ ట్రస్, రిషి సునాక్‌లపై తక్కువ నమ్మకాన్ని ఓటర్లు ప్రదర్శించారు. టోరీ సపోర్టర్స్(కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు)లో 49 శాతం మంది ఇప్పటికీ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌పైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని ప్రధాని రేసు నుంచి తప్పించొద్దని, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల కంటే ఆయన మీదే తమకు నమ్మకం ఉన్నట్లు వెల్లడించారు. జాన్సన్‌ను తొలగించడం ద్వారా పార్టీ, ఎంపీల ప్రతిష్ట దెబ్బతిందని తాము నమ్ముతున్నామని పలు ఇంటర్వ్యూలలో అట్టడుగు నియోజకవర్గాల ఓటర్లు చెప్తుండడం విశేషం. ‘‘ఆయనలా(బోరిస్) ఇతరులు వ్యవహరిస్తారనే నమ్మకం మాకు లేదు. ఎందుకంటే.. బ్రెగ్జిట్ సమయంలో, కరోనా వైరస్ కట్టడి సమయంలో, చివరకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ తలెత్తిన పరిస్థితులను ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిన్న చిన్న కారణాలతోనే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పించారు. ఆయనలా వీళ్లు పాలిస్తారని అనుకోవడం లేదు. ఆయనకు మరో అవకాశం ఇవ్వడం మంచిది’’ అని చాలామంది ఓటర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. లిజ్ ట్రస్ మరియు రిషి సునక్‌ల మద్దతు కంటే మిస్టర్ జాన్సన్ ప్రధానమంత్రిగా కొనసాగాలని 49 శాతం మంది టోరీ మద్దతుదారులు భావించారని yougov చేసిన ప్రత్యేక జాతీయ పోలింగ్ ద్వారా వెల్లడైంది. పైగా 2024 ఎన్నికల సమయంలో ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉంటేనే.. కన్జర్వేటివ్ పార్టీకి బాగా కలిసొస్తుందని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సర్వేను కన్జర్వేటివ్ పార్టీ పరిగణనలోకి తీసుకుంటాదా? అనేది కచ్చితంగా చెప్పలేం. మరోవైపు బ్రిటన్ ప్రధాని రేసులో తుది జాబితాలో ఉన్న రిషి సునాక్, విదేశాంగ కార్యదర్శి లిజ్ టస్లు.. తమ తమ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: బ్రిటన్ ప్రధాని రేసు.. రిషి సునాక్ వినూత్న ప్రచారం! -
ప్రధాని.. అధ్యక్షుడి మధ్య పోరు తప్పదా?
మాక్రాన్ ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముందున్నది ముళ్లబాట పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ ఎన్నికలో ఎన్ని విశేషాలు చోటుచేసుకున్నాయో, మున్ముందు ఆయనకు అన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. 59 ఏళ్లలో దేశ పార్లమెంట్ (నేషనల్ అసంబ్లీ)లో ఒక్క సీటు కూడా లేకుండానే దేశానికి అధ్యక్షుడై ఎల్సీ ప్యాలెస్‌లోకి అడుగుపెడుతున్న తొలి వ్యక్తి మాక్రాన్. ఫ్రాన్స్ ఐదో రిపబ్లిక్ (గణతంత్ర) వ్యవస్థ అమల్లోకి వచ్చిన 1958, అక్టోబర్ 4వ తేదీ నాటి నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పార్టీకి చెందిన వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం ఇదే మొదటిసారి. గతంలో సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉన్న మాక్రాన్ ‘ఎన్ మార్చే (ముందుకే)’ అన్న పార్టీని 2016లో స్థాపించి ఇప్పుడు ఆ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పోటీచేసి విజయం సాధించారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికల తర్వాతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్‌కు ఎన్నికైన వారిని డిప్యూటీలు అని పిలుస్తారు. డిప్యూటీలు మద్దతిచ్చే వ్యక్తినే ప్రధానమంత్రిగా దేశాధ్యక్షుడు నియమించాలి. ప్రధానిని నియమించడం కత్తిమీద సామే మాక్రాన్ కూడా వచ్చే నెలలో జరుగనున్న దేశ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశ ప్రధానమంత్రిని నియమించాలి. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న రెండో పెద్ద సవాల్. మొదటి సవాల్ కింద ఆయన దేశాధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి లా పెన్‌తో తలపడి రెండోరౌండ్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఆయన దేశ ప్రధానమంత్రిని నియమించడం కత్తిమీద సాము లాంటిదే. వచ్చే ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ ‘ఎన్ మార్చే’ పోటీ చేసినా ఆయన పార్టీకి 15 నుంచి 20 సీట్లకు మించి రావని తాజా ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. జాతీయ అసెంబ్లీగా వ్యవహరించే ఫ్రాన్స్ పార్లమెంట్లో మొత్తం 577 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని వారి అభిప్రాయం మేరకే దేశ ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు నియమించాలని దేశ ఐదో రిపబ్లిక్ రాజ్యాంగం సూచిస్తోంది. అందుకు భిన్నంగా దేశాధ్యక్షుడు వ్యవహరిస్తే ప్రధాన మంత్రిపై అవిశ్వాస తీర్మానంపెట్టి సదరు ప్రధానిని తీసివేసే హక్కు పార్లమెంట్ సభ్యులకు ఉంది. అమెరికా అధ్యక్ష తరహా కాదు ఫ్రాన్స్ పరిపాలనా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి తరహా లాంటిది కాదు, అలా అని భారత్ లాంటి పార్లమెంటరీ తరహా వ్యవస్థా కాదు. ఒకరకంగా సెమీ అధ్యక్ష పాలనావ్యవస్థ అనవచ్చు. భారత్ తరహాలో లోక్‌సభ, రాజ్యసభ ఉంటాయి. లోక్‌సభకు ప్రత్యక్ష, రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభను సెనేట్ అని పిలుస్తారు. ప్రభుత్వానికి ప్రధానమంత్రి అధిపతి అయితే దేశానికి దేశాధ్యక్షుడు అధిపతి. భారత్ తరహాలో కాకుండా ఫ్రాన్స్ ప్రజలు 1962 నుంచి దేశాధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు. రాజకీయానుభవం లేకపోయినా సరే దేశంలోని వివిధ స్థాయిల పాలనా వ్యవస్థల్లో ఎన్నికైన 500 మంది అభ్యర్థుల సంతకాలు సాధిస్తే ఎవరైనా దేశాధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే విజయం సాధించాలంటే 50 శాతానికిపైగా ఓట్లు రావాల్సిందే. అలా రాలేదంటే ఎక్కువ ఓట్లతో ముందున్న ఇద్దరి మధ్య మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటినే రెండో రౌండ్ ఎన్నికలంటారు. అంతకు ముందు లే పెన్ కంటే కేవలం మూడు శాతం ఓట్లు అధికంగా సాధించిన మాక్రాన్ రెండో రౌండ్ ఎన్నికల్లోనే 60 శాతానికిపైగా ఓట్లతో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏ పార్టీ నుంచైనా ప్రధానిని నియమించవచ్చు భారత్‌లో లాగా లోక్‌సభలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ నుంచే ప్రధాన మంత్రిని దేశాధ్యక్షుడు ఎంపిక చేయాలనే నిబంధనేమీ లేదు. అయితే ఆయనకు మెజారిటీ లోక్‌సభ సభ్యుల మద్దతు ఉండాలి. ఇక లోక్‌సభ సభ్యులైన డిప్యూటీలను కేబినెట్ మంత్రులుగా నియమించే అధికారాలు కూడా దేశాధ్యక్షుడికి ఉన్నాయి. కేబినెట్ సమావేశాలను కూడా ఆయనే నిర్వహిస్తారు. తద్వారా ప్రభుత్వ పాలనను తన చేతుల్లో ఉంచుకునే అవకాశం దేశాధ్యక్షుడికి ఉంది. శాసనాలను చేసే అధికారం మాత్రం ఆయనకు లేదు. వాటిని ఉభయసభలు ఆమోదించాల్సిందే. వాటిని తిరస్కరించే అధికారం కూడా ఆయనకు లేదు. అధ్యక్ష, పీఎంల మధ్య గొడవలు రావచ్చు ప్రధానమంత్రిగా ఎంపికైన పార్లమెంట్ సభ్యుడికి స్వతహాగా మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే దేశాధ్యక్షుడి సూచనలను గౌరవించాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలాంటి సందర్భాల్లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఏర్పడితే పార్లమెంటును రద్దుచేసే అధికారం దేశాధ్యక్షుడికి ఉంది. సొంత పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి ప్రధానమంత్రి అయినవారు ఇప్పటికే ముగ్గురే ఉన్నారు. వారి హయాంలో విభేధాల వల్ల ప్రభుత్వాలు సక్రమంగా నడవలేదు. ఆరో రిపబ్లిక్ వ్యవస్థ అవసరం కావచ్చు ఇప్పుడు మాక్రాన్‌కు కూడా ఇతర పార్టీల నుంచి ప్రధానిని ఎంపిక చేసుకోవడం మినహా మరో గత్యంతంరం లేదు. ఇరువురి మధ్య అధికార గొడవలు వస్తే. ఐదో రిపబ్లిక్ వ్యవస్థను రద్దుచేసి ఆరో రిపబ్లిక్ వ్యవస్థను తీసుకరావాల్సి వస్తుంది. ఇప్పటికే జన సమూహాలపై టెర్రరిస్టు దాడులు, తీవ్ర నిరుద్యోగ సమస్య, స్తంభించిపోయిన ఆర్థికవ్యవస్థ, సామాజిక అస్థిర పరిస్థితులు, గ్రామీణ–పట్టణాల మధ్య పెరిగిపోయిన అంతరాలతో సతమతమవుతున్న ఫ్రాన్స్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.