పార్లమెంటరీ ఓటింగ్‌లో మెజారిటీ సాధించిన యువ నాయకురాలు
బ్యాంకాక్: థాయిలాండ్ రాజకీయాల్లో షనవత్రల మరో కుటుంబ వారసురాలు ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రంగం సిద్ధమైంది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తరఫున అభ్యరి్థగా నిలబడిన నాయకురాలు పేటోంగ్‌టార్న్ షినవత్ర ఓటింగ్‌లో సాధారణ మెజారిటీకి కావాల్సిన 247 ఓట్లను దాటేశారు. దీంతో పేటోంగ్‌టార్న్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది.
దీంతో షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్‌టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గతంలో పేటోంగ్‌టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రులుగా చేశారు. 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపడుతున్న నేపథ్యంలో థాయిలాండ్‌లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతి పిన్క వయసు్కరాలిగా, రెండో మహిళగా రికార్డ్‌నెలకొల్పనున్నారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి బుధవారం థాయిలాండ్‌లోని రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment