
బాలీవుడ్ స్టార్ షారుక్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌ను కలిశారు. సినీ, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమానికి ట్రుడో సంప్రదాయ బంగారు వర్ణ షేర్వాణీని ధరించి రావడం చూపరులను ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్లు షారూక్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా పలువురు ట్రుడోతో తాము కలిసిఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరోవైపు షారుక్‌తో తన ఫోటోలను ట్రుడో సైతం షేర్ చేయడంతో పాటు కొత్త నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఇండో-కెనడా భాగస్వామ్యాలతో సినిమాల నిర్మాణం ఊపందుకుంటుందని వెల్లడించారు. భారత, కెనడా చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని ట్రూడో పేర్కొన్నారు. కెనడా ప్రధాని వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment