![Canada: Justin Trudeau Declares National Emergency Over Truckers Protests - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/16/tru.jpg.webp?itok=yVOxONKQ)
ఒట్టావా: కరోనా నిబంధనలకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడాలో ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర అధికారాల చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం ప్రకటించారు. దీనిప్రకారం నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే దీన్ని పరిమిత కాలం పాటు, కొద్ది ప్రాంతాల్లో, అవసరం మేరకే ఉపయోగిస్తామని ట్రూడో చెప్పారు. సైన్యాన్ని ప్రయోగించబోవడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ట్రక్ డ్రైవర్లు రెండు వారాలకు పైగా సరిహద్దులను, ఒట్టావా వీధులను వాహనాలతో దిగ్బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment