సాక్షి, న్యూఢిల్లీ : తాజాగా భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆదివారం తాజ్‌మహల్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్ ఎదుట ట్రూడూ భార్య, పిల్లలతో కలిసి ఫొటోలు దిగారు. అయితే, ఈ ఫొటోలో ఓ పొరపాటు కాంగ్రెస్ నేత శశి థరూర్ కంటబడింది. ఆయన ఆనందభరితలయ్యారు. వెంటనే ట్వీట్ చేశారు. తాజ్‌మహల్ ముందు ట్రూడో కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలో స్విమ్మింగ్ దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి పడగలిగాడు. ఏకంగా ప్రధాని ఫొటోలో ఫొటోబాంబ్ అయ్యాడు’ అని శశి ట్వీట్ చేశారు.
నిజానికి శశి ట్వీట్ చేసిన ఆ ఫొటోలో ట్రూడో కుటుంబం వెనుక ఉన్నది ఎవరో కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజ్ ముందు ట్రూడో ఫ్యామిలీ ఫొటోలో ఆయన టవల్‌లో ఉన్నట్టు ఎవరో ఫొటోషాప్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించకుండా నిజమైన ఫొటోనేమోనని థరూర్ అనుకున్నారు. తర్వాత ఆయన సారీ చెప్పారు. అది ఫొటోషాప్ చేసిన చిత్రమని గుర్తించలేకపోయానని, సోషల్ మీడియాలో నిజంగా అనిపించే చిత్రాలను కూడా నమ్మలేమని ఆయన ట్వీట్ చేశారు.
Sir who photoshopped this? And is this man arvind kejriwal?
— Wasi Mohammad (@WasiMd110) 18 February 2018
Comments
Please login to add a commentAdd a comment