శాన్‌ఫ్రాన్సిస్కో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో స్వేచ్ఛా హక్కును ట్రూడో ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారాయన.
ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవల నియంత్రణ కోసం కెనడా ప్రభుత్వం ఈ మధ్యే కొత్త రూల్ తెచ్చింది. దాని ప్రకారం.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ తప్పనిసరిగా ప్రభుత్వ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలని రూల్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మస్క్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ నిబంధనలపై ఓ జర్నలిస్ట్, మస్క్‌ను ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ ద్వారా ఘాటుగానే ఎలన్ మస్క్ స్పందించారు. సిగ్గు చేటు అని ట్రూడో సర్కార్‌పై మండిపడ్డారు.
Trudeau is trying to crush free speech in Canada. Shameful. https://t.co/oHFFvyBGxu
— Elon Musk (@elonmusk) October 1, 2023
ఇదిలా ఉంటే.. వాక్ స్వేచ్ఛను అణచివేస్తోందన్న ఆరోపణలు ట్రూడో ప్రభుత్వం ఎదుర్కోవడం కొత్తేం కాదు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ట్రక్కు డ్రైవర్ల నిరసనలను అణగదొక్కేందుకు అత్యవసర అధికారాన్ని ఉపయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా ఖలీస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment