ఒట్టావా: భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై మాట్లాడారు. అలాగే చట్టాలకు మద్దతునివ్వడం, గౌరవించడంపై ముచ్చటించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షునితో మొబైల్‌లో మాట్లాడారు.
'ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.' అని ట్రూడో ట్విట్ చేశారు.
Trudeau discusses India-Canada row with UAE President
— ANI Digital (@ani_digital) October 8, 2023
Read @ANI Story | https://t.co/WbTR3qq9Pw#IndiaCanada #JustinTrudeau #UAE pic.twitter.com/NCI03teIep
ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్‌తో భారత్-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ట్రూడో చర్చించారు. దౌత్య సంబంధాలు, చట్టాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను యూకే కట్టుబడి ఉంటుందని రిషి సునాక్ ఈ సందర్భంగ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం మళ్లీ యూఏఈ అధ్యక్షునితో ట్రూడో భారత్ గురించి చర్చించడం గమనార్హం.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment