provocation
-
ట్రూడో కవ్వింపు చర్యలు.. భారత్‌పై యూఏఈ అధ్యక్షునితో చర్చ
ఒట్టావా: భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌తో భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై మాట్లాడారు. అలాగే చట్టాలకు మద్దతునివ్వడం, గౌరవించడంపై ముచ్చటించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షునితో మొబైల్లో మాట్లాడారు. 'ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.' అని ట్రూడో ట్విట్ చేశారు. Trudeau discusses India-Canada row with UAE President Read @ANI Story | https://t.co/WbTR3qq9Pw#IndiaCanada #JustinTrudeau #UAE pic.twitter.com/NCI03teIep — ANI Digital (@ani_digital) October 8, 2023 ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్‌తో భారత్-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ట్రూడో చర్చించారు. దౌత్య సంబంధాలు, చట్టాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను యూకే కట్టుబడి ఉంటుందని రిషి సునాక్ ఈ సందర్భంగ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం మళ్లీ యూఏఈ అధ్యక్షునితో ట్రూడో భారత్ గురించి చర్చించడం గమనార్హం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు.. లండన్‌లో సంబరాలు -
చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం?
తైపీ: పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం చైనా చేసే యత్నాల గురించి తెలియంది కాదు. ఈ క్రమంలో.. తైవాన్‌పై అది మిలిటరీ వేధింపులకు పాల్పడుతూ వస్తోంది. తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్ వైపు పంపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణిస్తోంది తైవాన్ రక్షణశాఖ.. చైనా ఇప్పటివరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి(అనధికార సరిహద్దు రేఖ) మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్యగా తైవాన్ చెబుతోంది. యుద్ధవిమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్ను విలీనం చేసుకునేందుకు బీజింగ్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడం గమనార్హం. -
పచ్చ గూండాలు పేట్రేగిన వేళ..
సాక్షి, చిత్తూరు, పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ సృష్టించిన విధ్వంసంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పక్కా ప్రణాళిక, భారీ వ్యూహంతోనే ఈ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కటమే లక్ష్యంగా టీడీపీ ఈ దాడులకు వ్యూహ రచన చేసింది పక్కా ప్రణాళికతో జిల్లా నలుమూలల నుంచి టీడీపీకి చెందిన గూండాలను ఎంపిక చేసి మరీ పుంగనూరుకు తెచ్చినట్లు వెల్లడైంది. వారిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. వీరిని ముందుగానే మారణాయుధాలతో సహా పుంగనూరులో మోహరించారు. చంద్రబాబు పర్యటనను కూడా వ్యూహాత్మకంగా పుంగనూరుకు వచ్చేలా మార్పు చేశారు. ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా, పోలీసుల అనుమతి లేకుండానే దాడుల కోసమే ఆయన పుంగనూరు వచ్చారు. చంద్రబాబు వస్తూనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టడం, వెనువెంటనే విధ్వంసం సృష్టించడం.. అంతా వ్యూహం ప్రకారం చేశారు. కర్రలు, రాళ్లు, మద్యం సీసాలు, ఇతర మారణాయుధాలతో వందల సంఖ్యలో పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ ఓ కంటి చూపు కోల్పోయాడు. అయితే, పోలీసులు చాలా సహనంతో వ్యవహరించడంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. పుంగనూరు విధ్వంసంలో ఇప్పటి వరకు ఏడు నేరాలకు సంబంధించి మొత్తం 277 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం వరకు 90 మందిని అరెస్ట్ చేశారు.వారికి కోర్టు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు చల్లా బాబుతోపాటు కుట్ర, వ్యూహ రచన, దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురిని పోలీసులు గుర్తించారు. వారి గత చరిత్రను కూడా నిశితంగా పరిశీలించారు. దాడుల్లో భాగస్వాములైన వారిలో ఎక్కువ మంది పాత నేరాల చరిత్ర చూసి పోలీసులే షాక్ అయ్యారు. వారిలో కొందరి నేర చరిత్ర ఇదీ.. 1. నేరాల్లో ఘనుడు చల్లా బాబు పుంగనూరులో దాడి కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రదారి ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి అని పోలీసులు తేల్చారు. దాడులకు కుట్ర పన్నడం, వ్యూహాన్ని అమలుపరచడంలో ఇతనిదే ప్రధాన పాత్రగా పోలీసులు నిర్ధారించారు. చల్లా బాబు గత చరిత్ర అంతా నేర పూరితమేనని పోలీసు విచారణలో తేలింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఇతను ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. చల్లా బాబుపై ఉన్న పాత కేసుల్లో మచ్చుకు కొన్ని.. 1.1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్‌పై బాంబు దాడి కేసు 2. రొంపిచెర్ల క్రైం నం.368, 2021లో ఐపీసీ సెక్షన్లు, 143, 188, 341,269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీయాక్ట్ 3. క్రైం నం.18–2021 ఐపీసీ సెక్షన్లు 353, 506 రెడ్‌విత్ 34 కింద కేసు 4. క్రైం నం.8–2022 ఐపీసీ సెక్షన్లు 188, 341 కింద చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు 5. క్రైం నం.89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 కింద సోమల పీఎస్‌లో కేసు 6. క్రైం నం.72–2022 ఐపీసీ సెక్షన్లు› 341, 143, 290 రెడ్‌విత్ 149 కింద కేసు 7. క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కల్లూరు పోలీసు స్టేషన్లో కేసు 2. టీఎం బాబు (40) ఊరు: తొట్లిగానిపల్లి, గుడిపల్లి, కుప్పం నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులివీ.. 1. క్రైం నం.30–2009లో గుడిపల్లి పీఎస్‌లో పరిధిలో జరిగిన కేసు 2. క్రైం నం.171 ఇ, 506, 8–బి–1, ఏపీపీయాక్ట్ 3. క్రైం నం.165–2010 ఐపీసీ 392 సెక్షన్ల కింద కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు 3. క్రైం నం.38–2022 ఐపీసీ సెక్షన్ 448, 427, 323, 324, రెడ్‌విత్ 34 కింద గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు 3. భాష్యం విశ్వనాథనాయుడు (45) మండలం: శాంతిపురం, కుప్పం నియోజకవర్గం పార్టీ హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: 3 కేసుల్లో నిందితుడు 1. క్రైం నం.191–2021, ఐపీసీ సెక్షన్లు 143, 341, 506, 188, 59 డీఎంఏ, ఈడీఏ కింద రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. క్రైం నం.73–2022, ఐపీసీ సెక్షన్లు 177 ,182, 155 సెక్షన్ల కింద రెండో కేసు 3. రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం నం.130–2022 , ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 324తో పాటు రెడ్‌విత్ 149 కింద కేసు 4. జి.దేవేంద్ర (31) ఊరు: గోపన్నగారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: తెలుగు యువత మండల అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నం.26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 కింద కేసు నమోదైంది. 5. లెక్కల ధనుంజయనాయుడు ఊరు: కొక్కువారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత కేసులు: రెండుకేసుల్లో నిందితుడు 1. క్రైం. నం. 26–2022 నంబరుతో కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 341, 506, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 కింద కేసు నమోదు 2. క్రైం.నం. 368– 2021. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 3 ఈడీ యాక్ట్ కింద కేసులు 6. ముల్లంగి వెంకటరమణ (52) ఊరు: ముల్లంగివారిపల్లి, పులిచెర్ల మండలం పార్టీలో హోదా: టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత కేసులు: మూడు కేసుల్లో నిందితుడు 1.క్రైం. నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148, రెడ్‌విత్ 149 ఐపీసీ కింద కల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు 2. ఇదే స్టేషన్ పరిధిలో క్రైం.నం. 35–2017 ఐపీసీ సెక్షన్లు 447, 427, 324తోపాటు 34 ఐపీసీ కింద కేసు నమోదు 3. ఇక్కడే క్రైం. నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్ విత్ 34 కింద మరో కేసు 7. నూకల నాగార్జున నాయుడు (33) ఊరు: బొడిపటివారిపల్లి, పులిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల యువనేత, రాష్ట్ర ఐటీ విభాగం సభ్యుడు పాత కేసులు: ఆరు కేసుల్లో నిందితుడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కల్లూరులో 1 , సోమల పరిధిలో మరొక కేసు 1. క్రైం.నం. 368–2021 ఐపీసీ 134, 188, 341, 269, 270, 290 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటు సెక్షన్ 3 కింద ఈడీయాక్ట్ నమోదు 2. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్ విత్, 149 3. క్రైం.నం. 374–2021 ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 120బీ, 506, 507 4. క్రైం.నం. 5–2022 ఐపీసీ సెక్షన్లు 153, 427, 290 రెడ్ విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ 6. క్రైం.నం. 149–2022 ఐపీసీ సెక్షన్లు 143, 148, 354డీ, 324, 506, 509 రెడ్‌విత్ 149 8. ఇ. క్రిష్ణమూర్తినాయుడు (55) ఊరు: రాయవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: టీడీపీ మండల అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి 1 క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 506, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 2. క్రైం.నం. 12–2021, ఐపీసీ సెక్షన్లు 353, 506, రెడ్ విత్ 34 ఐపీసీ 9. నాగిశెట్టి నాగరాజ (38) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: మండలం తెలుగు యువత అధ్యక్షుడు పాత కేసులు: ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, రొంపిచెర్లలో మరో రెండు కేసులు 1. క్రైం.నం. 140–2021, ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 368–2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149తో పాటు సెక్షన్ 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్ విత్ 149 ఐపీసీ. 4. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ. 5. క్రైం.నం. 350–2021 ఐపీసీ సెక్షన్లు 151 సీఆర్పీసీ 10. కె.సహదేవుడు (50) ఊరు: బొమ్మయ్యగారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం పార్టీలో హోదా: రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారి పల్లి ఎంపీటీసీ పాత కేసులు: రొంపిచెర్ల, మరికొన్ని స్టేషన్లలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 89–2014 ఐపీసీ సెక్షన్లు 447, 506 రెడ్‌విత్ 34 2. క్రైం.నం. 331–2020 సీఆర్పీసీ 151 3. క్రైం.నం. 365–2020 సీఆర్పీసీ 151 4. క్రైం.నం. 14–2021 ఐపీసీ సెక్షన్లు 188 , 353, 506, రెడ్ విత్ 34 5. క్రైం.నం. 356–2021 ఐపీసీ సెక్షన్ 151 6. క్రైం.నం. 368–2021 ఐపీసీ 143, 188, 341, 269, 270, 290 రెడ్‌విత్ 149 7. క్రైం.నం. 9–2022 ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 143 రెడ్‌విత్ 149 8. క్రైం.నం. 10–2022 ఐపీసీ సెక్షన్లు 341, 323, 506, 153 11. ఉయ్యాల రమణ (44) ఊరు: బొమ్మయ్యగారిపల్లి, రొంపిచెర్ల మండలం, పుంగనూరు నియోజకవర్గం హోదా: రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పాత కేసులు: కల్లూరు , రొంపిచెర్ల, సోమల పోలీస్స్టేషన్ల పరిధిలో 8 కేసుల్లో నిందితుడు 1. క్రైం.నం. 140–2021 ఐపీసీ సెక్షన్ 353, 341 రెడ్ విత్ 34 2. క్రైం.నం. 368 – 2021 ఐపీసీ సెక్షన్లు 143, 188, 341, 269,270, 290 రెడ్‌విత్ 149 ఐపీసీతోపాటు 3 ఈడీ యాక్ట్ 3. క్రైం.నం. 2–2023 ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 506 రెడ్‌విత్ 149 4. క్రైం.నం.15–2021 ఐపీసీ సెక్షన్లు 188, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ 5. క్రైం.నం.40 – 2014 ఐపీసీ సెక్షన్లు 307, 326, 324 రెడ్‌విత్ 34 6. క్రైం.నం. 26–2022 ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 రెడ్‌విత్ 149 7. క్రైం.నం.140–2021 ఐపీసీ సెక్షన్లు 353, 341 రెడ్‌విత్ 34 8. క్రైం.నం. 89–2023 ఐపీసీ సెక్షన్లు 143, 341, 506 రెడ్‌విత్ 149 ఏ ఒక్కర్నీ వదలం పుంగనూరు దుశ్చర్యలో పోలీసుల రక్తం కళ్ల చూసిన ప్రతి ఒక్కరినీ వదలం. చట్ట ప్రకారం ముందుకెళ్తాం. బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన పోలీసులను మట్టుపెట్టాలని చూడటం, రాళ్లు, మద్యం బాటిళ్లు విసరడంపై మా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీల ఆధారంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం. ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆరోజు పోలీసులు అడ్డుపడకపోతే పుంగనూరు టౌన్లోకి పోయి విధ్వంసం సృష్టించేవాళ్లు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తప్పవు.– వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
చంద్రబాబుకు కావాల్సిందే మారణహోమం
కడప కార్పొరేషన్: ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఆద్యంతం హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా విమర్శించారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో బరితెగించిన చంద్రబాబు మాటలు, ఉచ్ఛ నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు, గలాటాలు, అల్లర్లు రేపి విధ్వంసం సృష్టించాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై, ఆయన కుటుంబంపై కొన్ని రోజులుగా సంస్కారహీనంగా, బజారు మనిషిలాగా బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెచ్చగొడుతూ చేసిన కామెంట్లతోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఎంత చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకుండా కేకలు వేస్తూ, తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడటం దారుణమన్నారు. వాహనాలను తగులబెట్టి పోలీసులను గాయపరచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అంతిమంగా చంద్రబాబుకు కావాల్సింది మారణ హోమమేనని, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత రాక్షసత్వానికి పాల్పడటం దారుణమని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంజద్‌బాషా డిమాండ్ చేశారు. -
అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలి!
Nawaz Sharif Allegedly Attacked in UK: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ కుట్రకు వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో ఆందోళన చేయాలని పాకిస్తాన్ యువతని కోరారు. మరోవైపు యూకెలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దాడి జరిగింది. షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్త దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ మీడియా శనివారం వెల్లడించింది. దీంతో నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకురాలు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ ఖాన్ని అవిశ్వాస తీర్మానానికి ముందే అరెస్టు చేయాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి అని అన్నారు. ఆదివారం ఇమ్రాన్‌ఖాన్ ప్రభత్వం పై జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందే నవాజ్ షరీఫ్ పై దాడి జరగడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా దానికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముడిపెట్టాడని విమర్శించారు. తమ పార్లమెంట్ కమిటీ కూడా ఆ పత్రాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ట్విట్టర్లో.. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ అన్ని హద్దులు అతిక్రమంచింది. శారీరక దాడిని సహించం. నవాజ్ షరీఫ్ పై జరిగిన దాడిలో ఆయన బాడీగార్డు గాయపడ్డాడు. నిందితులను సత్వరమే పట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి. (చదవండి: అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?) -
లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది. ‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం. ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. -
టీ చేయను అనడం భర్తను రెచ్చగొట్టడం కాదు: కోర్టు
ముంబై : భార్య టీ పెట్టననడం భర్తను రెచ్చగొట్టడం కాదని.. దాన్ని సాకుగా చూపి.. భర్త ఆమెపై దాడి చేయడం సమంజసం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యపై దాడి చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు, భర్తకు టీ తయారు చేయడానికి భార్య నిరాకరించడాన్ని ఆమెపై దాడి చేయడానికి రెచ్చగొట్టే చర్యగా అంగీకరించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ రేవతి మోహితే దేరే మాట్లాడుతూ ‘‘భార్య అంటే చరాస్తి.. వస్తువు కాదు. వివాహం అనేది సమానాత్వం మీద ఆధారపడిన స్నేహం. వాస్తవంగా మాత్రం అలా ఉండటం లేదు. ఇలాంటి కేసులు సహజమైనవి కావు. ఇది లింగం - వక్రీకృత పితృస్వామ్య వ్యవస్థని సూచిస్తోంది. ఇది తరచూ వైవాహిక సంబంధంలోకి వస్తుంది. సమాజంలోని పితృస్వామ్య భావనల వల్ల, స్త్రీ పురుషుడి ఆస్తి అనే ఆలోచన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. ఈ భావన ఒక వ్యక్తి తన భార్యను అతడి చరాస్థిగా భావించడానికి దారి తీస్తోంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. ‘‘సమాజంలోని లింగ వివక్షత వల్ల ఇంటి పని బాధ్యత భార్యదే అనే భావం పాతుకుపోయింది. ఈ లింగ వివక్షత వల్ల భార్య ఇంటి పనికే పరిమితం అయ్యింది. ఆ పనులన్ని ఆమెకు కేటాయించినవే అనే భావం పాతుకుపోయింది. ఇక వివాహంలో భార్య నుంచి భావోద్వేగ శ్రమను కూడా ఆశిస్తున్నారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళను తన అత్తారింటికి అంకితం అయ్యేలా ప్రేరేపిస్తున్నాయి. దాంతో మగవారు భార్యలను తమ స్తిరాస్తిగా భావిస్తున్నారు’’ అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి దంపతుల కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. భర్తకు కింది కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కేసు ఏంటంటే.. సోలాపూర్ జిల్లాలోని పంధర్పూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అక్తర్ అనే వ్యక్తికి భార్యతో తరచు ఏదో ఓ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో 2013 డిసెంబర్లో వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అక్తర్ తన భార్యను అతడికి ఒక కప్పు టీ పెట్టి ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆమె అదేం పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన అక్తర్ భార్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ గొడవకు ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల కుమార్తె బయటకు వచ్చి చూడగా.. తండ్రి తల్లిని దారుణంగా కొట్టడం కంట పడింది. ఆ తర్వాత అక్తర్ ఘటన జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేసి.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్తర్. ఆమె స్పృహలోకి రావడానికి వారం రోజులు పట్టింది. అనంతరం ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. భార్య టీ పెట్టడానికి నిరాకరించి తనను రెచ్చగొట్టిందని.. అందుకే దాడి చేశానని తెలిపాడు అక్తర్. ఇందుకు గాను స్థానిక కోర్టు 2016లో అక్తర్‌కి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నరహత్య ఆరోపణలపై అతడికి ఈ శిక్ష విధించింది. దాంతో అతడు బాంబే హై కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు తీర్పును హై కోర్టు సమర్థించింది. చదవండి: నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ.. న్యాయాన్యాయాల విచికిత్స -
భారత్, పాక్ మధ్య కవ్వింపులు
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కవ్వింపు చర్యలు చోటు చేసుకుంటున్నాయి. భారత నౌకా దళానికి చెందిన కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు అనూహ్యంగా మరణ శిక్ష విధించడం, బుధవారం నాడు పాకిస్తాన్‌కు పంపించాల్సిన ఆ దేశ నేరస్థుల విడుదలను భారత ప్రభుత్వం నిలిపివేయడం ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. వారం రోజుల క్రితం పాకిస్థాన్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ నేపాల్ రాజధాని కట్మాండులో కిడ్నాప్ అవడం, దాని వెనక భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఉందని పాకిస్థాన్ ఆరోపించడం కూడా ఇక్కడ గమనార్హం. విదేశీ చట్టం ఉల్లంఘన, బలూచిస్థాన్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తదితర అభియోగాలపై కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్ మరణ శిక్ష విధించింది. యుద్ధం జరుగుతున్న సమయాల్లో తప్పించి శత్రు దేశానికి సంబంధించిన గూఢచారులకు లేదా సైనిక అధికారులకు సంబంధిత ఆరోపణలపై మరణశిక్షలు విధించరు. నిజంగా బలూచిస్థాన్ తిరుగుబాటు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు బలమైన సాక్షాధారాలు లభించినప్పటికీ వాటిని అంతర్జాతీయ సమాజం ముందు నిరూపించాలి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భారత కాన్సులేట్ నిందితుడిని ప్రత్యక్షంగా కలుసుకొని అవకాశం ఇవ్వాలి. కేసును రహస్యంగా విచారించాల్సిన అవసరం కూడా లేదు. 2016, మార్చి 25వ తేదీ నుంచి 2017, మార్చి 31 తేదీ మధ్య నిందితుడు కుల్‌భూషణ్‌ను కలసుకునేందుకు ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీ 13 సార్లు పాక్ ప్రభుత్వానికి పిటిషన్లు దాఖలు చేసింది. అయినా అవకాశం ఇవ్వలేదు. కుల్‌భూషణ్ అరెస్ట్ మొదలుకొని ఆయనకు మరణ శిక్ష విధించడం వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నీ వివాదాస్పదమే. కుల్‌భూషణ్‌ను పాక్‌లో అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. 2016, ఏప్రిల్ 2వ తేదీన ఆయన్ని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి పాక్ ప్రభుత్వానికి విక్రయించారని అఫ్ఘాన్ జర్నలిస్ట్ మాలిక్ అచాక్జెయిన్ అప్పట్లోనే వెల్లడించారు. 2015, డిసెంబర్ నెలలో కుల్‌భూషణ్‌ను తాలిబన్లు కిడ్నాప్‌చేసి పాక్ అధికారులకు అమ్మేశారని పాక్‌లోని జర్మన్ రాయబారి డాక్టర్ గుంటర్ మెలాక్ తెలిపారు. పాక్ ప్రభుత్వం తీవ్రమైన అభియోగాలను కుల్‌భూషణ్ ఖండించినప్పటికీ బలూచిస్థాన్‌లోని తిరుగుబాటుదారులతో తాను సమావేశం అయ్యేందుకు ప్రయత్నించానన్న విషాయాన్ని ఆయన అంగీకరించారు. హుస్సేన్ ముబారక్ అనే దొంగ పేరుతో ఆయన పాస్‌పోర్టు కలిగి ఉన్నారనే విషయం కూడా రుజువైంది. ఆయన తమ మాజీ నౌకాదళాధికారేనని భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. పాకిస్తాన్లో మిలిటెంట్లను పాక్ గూఢచారులు రెచ్చకొట్టడం, వారికి సహాయ సహకారాలు అందించడం ఎంత వాస్తవమో బలూచిస్థాన్‌లో తిరుగుబాటు దారులకు భారత్ రెచ్చగొట్టడం, సహాయ సహకారాలు అందించడం అంతే సహజం. 2016, సెప్టెంబర్ నెలలో యూరీ సెక్టార్‌పై పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైనికులు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు జరపడం తెల్సిందే. ఇరాక్‌లో కిడ్నాపైన కుల్‌భూషణ్ పాక్‌లో తేలాడు. కట్మాండులో కిడ్నాపైన పాక్ రిటైర్ట్ ఆర్మీ జనరల్ మరెక్కడ తేలుతాడో చూడాలి.