ఒటావో : కరోనా వైరస్ బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16రోజుల చికిత్స అనంతరం గ్రెగొరీ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా సోఫి గ్రెగొరీ మార్చి 12న లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వల్ప జ్వరం రావడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు. దీంతో అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయిన ఆమెకు తగిన చికిత్స అందించారు. ప్రధాని ట్రూడో భార్యకు వైరస్ సోకడంతో ఆయన కూడా ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వరించారు.
కాగా వ్యాధి నుంచి పూర్తి కోలువడంతో చాలా సంతోషంగా ఉందంటూ సోఫీ గ్రెగోరి ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ కెనడాలోను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆదేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేల దాటిపోయింది. మృతుల సంఖ్య 61కి చేరింది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షల్ని మరింత కఠినం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment