ఒటావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డి్రస్టిక్ట్స్‌కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డి్రస్టిక్ట్స్‌లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్ కెనడియన్ అయిన జగీ్మత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పారీ్ట(ఎన్‌డీపీ) 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్ మేకర్’గా అవతరించింది. అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్‌డీపీ 44 సీట్లు గెల్చుకుంది. బ్లాక్ క్యూబెకాయిస్ 32, గ్రీన్ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి.
బ్లాక్ క్యూబెకాయిస్, గ్రీన్ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రూడోకు మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడుతామని ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జగీ్మత్ సింగ్ వ్యాఖ్యానించారు. కెనడాలోని ఒక రాజకీయ పారీ్టకి నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నేత 40 ఏళ్ల జగీ్మత్ సింగ్‌నే కావడం విశేషం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచిన జగీ్మత్ సింగ్ గతంలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ట్రూడో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కెనడా ప్రజలు ప్రగతిశీల అజెండాకు ఓటేశారని ఫలితాల అనంతరం ట్రూడో వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవిచూడాల్సి వచి్చంది. ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూబెక్, అల్బెర్టా తదితర ప్రావిన్స్‌ల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ భారీగా దెబ్బ తిన్నది. ట్రూడో ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని కన్సర్వేటివ్ పార్టీ నేత షీర్ వ్యాఖ్యానించారు. మరోసారి ఎన్నికలు వస్తే తమదే విజయమన్నారు. 2.74 కోట్ల ఓటర్లును కెనడాలో ఈ ఎన్నికల్లో 65% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 97 మంది మహిళలు గెలిచారు.
మోదీ శుభాకాంక్షలు: కెనడా ఎన్నికల్లో విజయం సాధించిన జస్టిన్ ట్రూడోకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, బహుళత్వ విలువల విషయంలో భారత్, కెనడాలు ఒకటేనన్న మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ట్రూడోతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మంగళవారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment