భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ  | British Sikh MP Reacts To Canada's Allegation Against India | Sakshi
Sakshi News home page

భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ 

Published Wed, Sep 20 2023 12:27 PM | Last Updated on Wed, Sep 20 2023 12:40 PM

British Sikh MP Reacts To Canada Allegation Against India - Sakshi

లండన్: కెనడా-భారత్ మధ్య వివాదం మెల్లగా ఎల్లలు దాటుతోంది. ప్రపంచ దేశాల నేతలు కూడా ఈ తగువుపైనే దృష్టి పెట్టారు. కెనడా ప్రధాని అగ్రరాజ్యం అమెరికా మద్దతు కోరుతుండగా తాజాగా బ్రిటీష్ సిక్కు ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ దేశాయ్ కెనడాలోని సిక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.  

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినేలా సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు గురైన ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తమ దేశ పౌరుడని తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుందని అందుకు కచ్చితమైన  ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన వెంటనే కెనడా విదేశాంగ శాఖ మంత్రి అక్కడి భారత దౌత్యాధికారిని బహిష్కరించడం అంతే దీటుగా స్పందించి భారత్ కూడా కెనడా దౌత్యధికారిని బహిష్కరించడం అంతా చకచకా జరిగిపోయాయి.

 

ఇప్పటికే కెనడా భారత్ చర్యను ఖండించాలంటూ అమెరికాను విజ్ఞప్తి చేసింది. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు కానీ కెనడాలోని సిక్కు ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ దేశాయ్. ఎక్స్ వేదికగా ఆయన రాస్తూ కెనడాలోని పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడ ఉంటున్న చాలా మంది సిక్కుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆత్రుతతోనూ, కోపంతోనూ, భయంతోనూ ఉన్నారని అన్నారు. కెనడా ప్రధాని సన్నిహితులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సత్వర న్యాయం కోసం మేము కూడా యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు.  

ఇది కూడా చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement