British MP
-
భారత్-కెనడా వివాదం: ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ సిక్కు ఎంపీ
లండన్: కెనడా-భారత్ మధ్య వివాదం మెల్లగా ఎల్లలు దాటుతోంది. ప్రపంచ దేశాల నేతలు కూడా ఈ తగువుపైనే దృష్టి పెట్టారు. కెనడా ప్రధాని అగ్రరాజ్యం అమెరికా మద్దతు కోరుతుండగా తాజాగా బ్రిటీష్ సిక్కు ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్ కెనడాలోని సిక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినేలా సంచలన ఆరోపణలు చేశారు. హత్యకు గురైన ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తమ దేశ పౌరుడని తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుందని అందుకు కచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన వెంటనే కెనడా విదేశాంగ శాఖ మంత్రి అక్కడి భారత దౌత్యాధికారిని బహిష్కరించడం అంతే దీటుగా స్పందించి భారత్ కూడా కెనడా దౌత్యధికారిని బహిష్కరించడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇప్పటికే కెనడా భారత్ చర్యను ఖండించాలంటూ అమెరికాను విజ్ఞప్తి చేసింది. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు కానీ కెనడాలోని సిక్కు ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశాయ్. ఎక్స్ వేదికగా ఆయన రాస్తూ కెనడాలోని పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడ ఉంటున్న చాలా మంది సిక్కుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆత్రుతతోనూ, కోపంతోనూ, భయంతోనూ ఉన్నారని అన్నారు. కెనడా ప్రధాని సన్నిహితులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. సత్వర న్యాయం కోసం మేము కూడా యూకే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. Concerning reports coming from #Canada. Many #Sikhs from #Slough and beyond have contacted me; anxious, angry or fearful. Given Canadian PM Trudeau stated they’ve been working with close allies, we’re in touch with UK Gov to ensure justice is delivered.https://t.co/U4ceflJmHq — Tanmanjeet Singh Dhesi MP (@TanDhesi) September 19, 2023 ఇది కూడా చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు -
బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్’ మూర్తి అల్లుడు
లండన్: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్ ఎంపీ రిషి సునక్(39) భారీ ప్రమోషన్ కొట్టేశారు. బ్రిటన్ కేబినెట్లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్ చీఫ్ స్పెషల్ అడ్వైజర్ డొమినిక్ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది. వీరితోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్ శర్మ(52)కు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్(39)ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని ‘దేశి కేబినెట్ ఇన్ యూకే హిస్టరీ’గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని రిషి అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్ కాలేజీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. -
బ్రిటీష్ ఎంపీని వెనక్కి పంపిన భారత్
న్యూఢిల్లీ : బ్రిటీష్ పార్లమెంటేరియన్ లార్డ్ అలెగ్జాండర్ కార్లిలేను ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు భారత్‌లోకి అనుమతించలేదు. సరైన వీసా పత్రాలు లేని కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. కార్లిలే పర్యటన ఉద్దేశం, అతను వీసాలో సమర్పించిన వివరాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అతన్ని తిరిగి ఇంగ్లండ్ పంపించామన్నారు. కార్లీలే ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు న్యాయ సలహాదారునిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ అవినీతి కేసులో బంగ్లా కోర్టు ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె న్యాయ సలహాదారుడిగా ఉన్న కార్లిలేను బంగ్లాదేశ్‌లోని రానివ్వబోమని ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన జియాకు మద్దతుగా ఇండియాలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గతంలోనే తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మీడియాకు జియా కేసులోని వాస్తవాలను వివరిస్తానని కూడా అన్నారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాని వేరే విధంగా పేర్కొనడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం'
లండన్: ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్ ను హత్య చేసిన ఘటన మరవకముందే మరో మహిళా ఎంపీకి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారని పోలీసులకు లేబర్ పార్టీ ఎంపీ య్వెటీ కూపర్ ఫిర్యాదు చేశారు. తన పిల్లలను, మనవలను కూడా హతమారుస్తానని హెచ్చరించినట్టు వెల్లడించారు. 'యూరప్ అనుకూల ప్రచారం ఆపకపోతే నిన్ను.. నీ పిల్లలను, మనవలను చంపుతాన'ని గుర్తు తెలియని వ్యక్తులు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ను పోలీసులు వెంటనే తొలగించారు. గతవారం వెస్ట్ యార్క్ షైర్ ఎంపీ జో కాక్స్ ను కాల్చి చంపిన నేపథ్యంలో య్వెటీ కూపర్ కు భద్రత పెంచారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ కలిసే ఉండాలా, విడిపోవాలా అనే అంశంపై గురువారం(జూన్ 23న) రెఫరెండం జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
ఇన్ఫోసిస్ అల్లుడు.. ఎంపీ అయ్యాడు!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడు రిషి శునక్ బ్రిటన్‌లో అధికార పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. దీనిపై నారాయణమూర్తి తన సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన రిషి.. 51 శాతం ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి యూకే ఇండిపెండెన్స్ పార్టీ అభ్యర్థి మాథ్యూ కూక్ మాత్రం కేవలం 15 శాతం ఓట్లే గెలుచుకున్నారు. లేబర్ పార్టీకి చెందిన మైక్ హిల్‌కు 13 శాతం ఓట్లు వచ్చాయి. దాంతో రిషి భారీ మెజారిటీతో నెగ్గినట్లయింది. రిచ్మండ్-యార్క్స్ నియోజకవర్గంలో ఆయన విజయం పట్ల నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శునక్ (34), అతడి భార్య అక్షత (35) ఎన్నికల ప్రచార సమయంలో బాగా కష్టపడ్డారని, వాళ్ల కష్టానికి తగిన ఫలితం లభించిందని నారాయణమూర్తి చెప్పారు. ఎంపీగా కూడా ఆయన బాగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కన్సర్వేటివ్ పార్టీ తరఫున మొత్తం 10 మంది భారత సంతతి ప్రతినిధులు ఎంపీలుగా ఎన్నిక కాగా.. వాళ్లందరిలో తొలిసారి ఎన్నికైన ఏకైక వ్యక్తి రిషి. మిగిలిన తొమ్మిది మందిలో పాల్ ఉప్పల్ తప్ప మిగిలిన అందరూ ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరూ మాత్రం ఓడిపోయారు. రిషి శునక్, అక్షతలు 2009 ఆగస్టు 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చదివారు. -
బ్రిటన్ ఎంపీ పర్యటన
బిటన్ ఎంపీ డానియల్ బైల్స్ కుటుంబ సమేతంగా చారిత్రక ఆలయూల సందర్శన నర్సంపేటలోని ద్వారకపేటకు చెందిన ప్రశాంతిరెడ్డిని వివాహం చేసుకున్న బ్రిటన్ ఎంపీ డానియల్ బైల్స్ తన పిల్లలు సాషా, లారాతో కలిసి బుధవారం వరంగల్‌లో పర్యటించారు. వేరుుస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్‌లోని కాకతీయుల కోట సొబగులను తిలకించారు. హన్మకొండ కల్చరల్/ ఖిలావరంగల్/ నిట్ క్యాంపస్ : కాకతీయుల కళాసంపద అద్భుతమని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు డానియల్ బైల్స్ అన్నారు. నర్సంపేట ద్వారకపేటకు చెం దిన కటంగూరి ప్రశాంతిరెడ్డిని వివాహం చేసుకున్న ఆయన, తన పిల్లలు సాషా, లారాతో కలిసి బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించారు. హన్మకొండలోని వేరుుస్తంభాలు, వరంగల్‌లోని భద్రకాళి ఆలయంతో పాటు ఖిలావరంగల్‌లోని కాకతీయుల కోట సొబగులను తిలకించారు. కాకతీయుల శిల్పకళా సౌందర్యాన్ని చూసి వారు ముగ్ధులయ్యూరు. వేరుుస్తంభాలు, భద్రకాళి ఆలయంలో... చారిత్రక వేరుుస్తంభాల ఆలయంలో డానియల్ బైల్స్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేందర్రావు ఎంపీ దంపతులను పూలమాలతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు, శేష వ స్త్రాలను బహూకరించారు. అనంతరం డానియల్ బైల్స్ దంపతులు ఆలయంలోని వెంట్రుక బట్టే సన్నని రంధ్రాలతో చేసిన శిలలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్‌లోని ఖిలా వరంగల్ కోటను సందర్శించి కోటలోని కాకతీయుల నాటి కట్టడాలను పరిశీలించారు.కోటలో స్వచ్చ భారత్‌లో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, వేదపండితులు ఆలయమర్యాదలతో స్వాగతించారు. డానియల్ దంపతులకు ఈఓ అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. బైల్స్ స మీప బంధువులు వసుంధర, కటంగూరి శ్రీనివాసరెడ్డి, కటంగూరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఖిలావరంగల్ కోటలో... కాకతీయుల కోటను సందర్శించిన క్రమంలో శిల్పాల ప్రాంగణంలో నగరపాలక సంస్థ మాజీ మెయర్ నగర తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డానియల్ బైలా మాట్లాడారు. భారత దేశం ఒక గొప్ప పర్యాటక కేంద్రమని, ఇందులో కాకతీయుల కళాసంపద అద్భుతమన్నారు. కాకతీయుల అద్భుతమైన చారిత్రక కట్టడాలు, శిధిలమైన వారసత్వసంపద అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి నిధులు కేటారుుంచేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ‘కోట’లో డాక్టర్ తిరుపతిరెడ్డి,డాక్టర్ వసుంధర ప్రోత్సాహంతో రుద్రమదేవి విగ్రహన్ని ఏర్పాటు చేస్తాన చెప్పారు. అనంతరం బ్రిటన్ ఎంపి డానియల్ సతీమణి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు తన పుట్టినిళ్లు అని, తనకు ఓరుగల్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రిటన్ లో వైద్యశాల ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా సేవలందిస్తున్నాని తెలిపారు. తన భర్త డానియల్ బెల్స్ ఎంపీ కన్నా... గొప్ప సాహసవీరుడని వివరించారు. బ్రిటన్ ప్రభుత్వం నిర్వహించిన సాహస క్రీడల్లో నిర్ధిష్ట సమయంలో సముద్రాన్ని ఈది రెండు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్‌లో చోటు సంపాదించారని పేర్కొన్నారు. బ్రిటన్ ఆర్మీకి ఆతి చిన్న వయసులోనే అటార్ని జనరల్ పదవికి ఎంపికయ్యారని చెప్పారు. డానియల్ పదవికీ రాజీనామ చేసి, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారని వెల్లడించారు. బ్రిటన్ ఎంపీ వెంట ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, మాజీ డిప్యూటీ మేయర్ కక్కెసారయ్య, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, డాక్టర్ పోలన టరాజు, బిల్ల శ్రీకాంత్ తదితరులు ఎంపీకి పుష్పగుచ్ఛం అందించారు. రావులకిషన్, పాలపాక మార్టిన్లూతర్, రఘనాధ్‌రెడ్డి, శేషు, బిల్లశ్రీకాంత్, ఆచ్చవినోద్కుమార్, పుప్పాల రాజేందర్ తదితరులు ఉన్నారు