'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం' | British MP receives death threat via Twitter | Sakshi
Sakshi News home page

'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం'

Published Wed, Jun 22 2016 1:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం'

'నిన్ను, నీ పిల్లల్ని హతమారుస్తాం'

లండన్: ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జో కాక్స్ ను హత్య చేసిన ఘటన మరవకముందే మరో మహిళా ఎంపీకి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారని పోలీసులకు లేబర్ పార్టీ ఎంపీ య్వెటీ కూపర్ ఫిర్యాదు చేశారు. తన పిల్లలను, మనవలను కూడా హతమారుస్తానని హెచ్చరించినట్టు వెల్లడించారు. 'యూరప్ అనుకూల ప్రచారం ఆపకపోతే నిన్ను.. నీ పిల్లలను, మనవలను చంపుతాన'ని గుర్తు తెలియని వ్యక్తులు ట్విటర్ లో పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్ ను పోలీసులు వెంటనే తొలగించారు. గతవారం వెస్ట్ యార్క్ షైర్ ఎంపీ జో కాక్స్ ను కాల్చి చంపిన నేపథ్యంలో య్వెటీ కూపర్ కు భద్రత పెంచారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)లో బ్రిటన్ కలిసే ఉండాలా, విడిపోవాలా అనే అంశంపై గురువారం(జూన్ 23న) రెఫరెండం జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement