‘దేశద్రోహులకు మృత్యువుని’ | Jo Cox murder accused gives name as 'death to traitors, freedom to Britain' | Sakshi
Sakshi News home page

‘దేశద్రోహులకు మృత్యువుని’

Published Sun, Jun 19 2016 1:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

‘దేశద్రోహులకు మృత్యువుని’

‘దేశద్రోహులకు మృత్యువుని’

లండన్: ‘‘నా పేరు ‘దేశద్రోహులకు మృత్యువు... బ్రిటన్‌కు స్వాతంత్య్రం’ అని బ్రిటిష్ ప్రతిపక్ష మహిళా ఎంపీ జో కాక్స్ హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న థామస్ మైర్(52) వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. మేజిస్ట్రేట్ నీ పేరేమిటని మైర్‌ను ప్రశ్నించగా... ఇలా స్పందించాడు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు.

41 ఏళ్ల జో కాక్స్ గురువారం తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచి, ఆ తరువాత తుపాకీతో కాల్చి చంపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement