ప్రముఖ మహిళా ఎంపీ కాల్చివేత.. | British MP Jo Cox dies after stabbing, shooting attack in constituency | Sakshi
Sakshi News home page

ప్రముఖ మహిళా ఎంపీ హత్య..

Published Thu, Jun 16 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

ప్రముఖ మహిళా ఎంపీ కాల్చివేత..

ప్రముఖ మహిళా ఎంపీ కాల్చివేత..

  • నియోజకవర్గంలోనే కొట్టిచంపిన దుండగుడు

  • బ్రిటన్‌లో ప్రముఖ మహిళా ఎంపీగా పేరొందిన జో కాక్స్‌ను ఆమె నియోజకవర్గంలోనే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఆమెపై కత్తితో దాడిచేసి.. ఆపై తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపాడు. లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యార్క్‌షైర్‌ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోనే కొనసాగాలన్న వాదానికి గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఆమె హత్య బ్రిటన్‌ రాజకీయ వర్గాలను షాక్‌ కు గురిచేస్తున్నది.

    గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బిర్‌స్టాల్‌ పట్టణంలో ఆమెపై దుండగుడు దాడి చేశాడు. ఆమె రాకముందే ఆమె కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న దుండగుడు జో కాక్స్ రాగానే ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 41 ఏళ్ల కాక్స్‌ సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో లీడ్స్‌ జనరల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె హత్యకు కారణాలు ఏమిటన్న దానిపై ఇప్పుడు వెల్లడించలేమని, ఆమెపై దాడికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్టుచేశామని వెస్ట్ యార్క్‌షైర్‌ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్‌ తెలిపారు. ఈ కేసులో ఇంక ఎవరికోసం గాలించడం లేదని చెప్పారు.
     

     

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement