British lawmaker shot
-
బ్రిటన్ ఎంపీ కాక్స్ హత్యకేసులో వ్యక్తి అరెస్ట్
లండన్: బ్రిటన్ మహిళా ఎంపీ జో కాక్స్ హత్యకేసుకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. థామన్ మెయిర్ (52) అనే వ్యక్తిని వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బీబీసీ వెల్లడించింది. నిందితుడిని ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా గురువారం బిర్స్టాల్ పట్టణంలో ఎంపీ జో కాక్స్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. జో కాక్స్ కాల్పులు జరపటంతో పాటు, ఆమెపై దాడి చేసి కత్తితో దారుణంగా హతమార్చాడు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. మెయిర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు...అతడి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా వెస్ట్ యార్క్‌షైర్ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్ మాట్లాడుతూ కాల్పుల ఘటనలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు ఎంజీ జో కాక్స్‌కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజకీయ నేతలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా 1990లో ఈస్ట్బోర్నే ఎంపీ ఇయాన్ గౌ ఉత్తర ఐరిష్ టెర్రర్ గ్రూపు చేతిలో హతమయ్యారు. -
ప్రముఖ మహిళా ఎంపీ కాల్చివేత..
నియోజకవర్గంలోనే కొట్టిచంపిన దుండగుడు బ్రిటన్‌లో ప్రముఖ మహిళా ఎంపీగా పేరొందిన జో కాక్స్‌ను ఆమె నియోజకవర్గంలోనే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఆమెపై కత్తితో దాడిచేసి.. ఆపై తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపాడు. లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యార్క్‌షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోనే కొనసాగాలన్న వాదానికి గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఆమె హత్య బ్రిటన్ రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేస్తున్నది. గురువారం మిట్టమధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బిర్స్టాల్ పట్టణంలో ఆమెపై దుండగుడు దాడి చేశాడు. ఆమె రాకముందే ఆమె కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న దుండగుడు జో కాక్స్ రాగానే ఆమెపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన 41 ఏళ్ల కాక్స్ సంఘటన స్థలంలోనే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో లీడ్స్ జనరల్ ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె హత్యకు కారణాలు ఏమిటన్న దానిపై ఇప్పుడు వెల్లడించలేమని, ఆమెపై దాడికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్టుచేశామని వెస్ట్ యార్క్‌షైర్ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్ తెలిపారు. ఈ కేసులో ఇంక ఎవరికోసం గాలించడం లేదని చెప్పారు.