రేప్ చేస్తామంటూ ఎంపీకి బెదిరింపులు
లండన్: అత్యాచారం చేస్తామంటూ ఒకే రాత్రి 600కు పైగా బెదిరింపులు వచ్చాయి. బాధితురాలు సాధారణ మహిళేమీ కాదు. బ్రిటన్లో లేబర్పార్టీ ఎంపీ జెస్సీ ఫిలిప్స్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తనకు ట్విట్టర్లో బెదిరింపులు వచ్చాయని, ట్విట్టర్ ఈజ్ డెడ్ అంటూ జెస్సీ ఫిలిప్స్ ట్వీట్ చేసింది. ఆన్లైన్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జెస్సీ ఫిలిప్స్ ఉద్యమం ప్రారంభించాక నెటిజెన్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి.
నెటిజన్లు ట్విట్టర్లో జెస్సీ ఫిలిప్స్ను టార్గెట్ చేసుకున్నారు. ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యపదజాలంతో ట్వీట్లు చేస్తున్నారు. తనను లైంగికంగా వేధించేలా వద్దా అంటూ 5 వేల మంది ట్వీట్లు చేసినట్టు జెస్పీ ఫిలిప్స్ చెప్పారు. కాగా జెస్సీ ఫిలిప్స్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 19 ఏళ్ల వయసులో తాను లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పారు. ఓ వ్యక్తి తనపట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జెస్సీ ఫిలిప్స్ డిమాండ్ చేశారు. బర్మింగ్హామ్ యార్డ్లీ నుంచి ఆమె బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికయ్యారు.