
తన తమ్ముడు మిచెల్ ట్రూడోతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(టీషర్ట్ వేసుకున్న వ్యక్తి)
స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మిచెల్ ట్రూడో పడవ ప్రమాదంలో మృతిచెందాడు.
‘ఈరోజుతో నువ్వు 43వ వసంతంలోకి అడుగుపెట్టేవాడివి. కానీ 20 ఏళ్ల క్రితమే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు. నా చిన్నారి తమ్ముడిని ప్రేమిస్తూనే ఉంటా. హ్యాపీ బర్త్‌డే మైక్’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన తమ్ముడు మిచెల్ ట్రూడోకు నివాళులు అర్పించారు. తన సోదరుడిని గుర్తుచేసుకుంటూ.. జస్టిన్ చేసిన భావోద్వేగపూరిత ట్వీట్ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. ‘మీరు మీ సోదరుడిని ఎంతగా మిస్సవుతున్నారో ఊహించగలను. ఎందుకంటే నేను కూడా 23 ఏళ్ల ప్రాయంలో నా తమ్ముడు (తన పేరు కూడా మిచెల్)ని కోల్పోయానంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మిచెల్ ట్రూడోకు నివాళులర్పిస్తూ మరి కొంతమంది సంతాపం తెలిపారు.
కాగా కెనడా మాజీ ప్రధాని అయిన పెర్రీ ట్రూడోకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు జస్టిన్ ట్రూడో కెనడా ప్రస్తుత ప్రధాని. రెండో కుమారుడు అలెగ్జాండర్ ట్రూడో ఫిల్మ్ మేకర్, జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇక అందరికంటే చిన్న వాడైన మిచెల్ ట్రూడో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మిచెల్ పడవ ప్రమాదంలో మృతిచెందాడు. కొకానే సరస్సులో విహరిస్తుండగా గల్లంతైన మిచెల్ శవం కూడా దొరకపోవడంతో ట్రూడో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగి 20 ఏళ్లవుతున్నా తన తమ్ముడి ఙ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతున్నాయంటూ జస్టిన్ భావోద్వేగానికి లోనయ్యారు.
You would have been 43 today, but you’ve been gone 20 years now. I love you, little brother. Happy birthday Miche. pic.twitter.com/wJHnoJ8V1V
— Justin Trudeau (@JustinTrudeau) October 3, 2018