mobile devices
-
కెనడాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం
టొరంటో: చైనాకు చెందిన టిక్‌టాక్‌పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది. ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్ ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ తెలిపారు. ఇది ప్రారంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలుంటాయని ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. డెన్మార్క్‌లో ప్రభుత్వ మొబైళ్లు తదితరాల్లో టిక్‌టాక్‌ను నిషేధించాలని పార్లమెంటు పేర్కొంది. అమెరికా నెల రోజుల్లోపు ప్రభుత్వ మొబైళ్లు తదితర పరికరాల్లో నుంచి టిక్‌టాక్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. -
మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు చెక్.. ఈ ఐడియా అదిరింది!
న్యూఢిల్లీ: త్వరలో మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు తెరపడనుంది. ఉన్నట్టుండి చార్జింగ్ అయిపోతే, మరొకరి ఫోన్ చార్జర్‌తో అవసరం గట్టెక్కవచ్చు. ఇందుకు వీలుగా ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్‌ను దశలవారీగా అమలు చేయడానికి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర విని యోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఏకరూప చార్జింగ్ పోర్ట్ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వశాఖల టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ వారణాసి విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్‌తో తీసుకొచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సమ్మతి తెలిపారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం.. యాపిల్ కంపెనీకి పెద్ద దెబ్బే!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్‌ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి ఇకపై కామన్ ఛార్జింగ్ పోర్ట్ ఉండాలంటూ కొత్త నిబంధనలతో కూడిన చట్టాన్ని ఆమోదించింది. 2024 కల్లా ఈ నిబంధన పూర్తిగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇకపై ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్‌లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపించనున్నాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్ ఛార్జర్లే అన్ని డివైజ్లకీ ఉండాలి. వీటితో పాటు ఇ-రీడర్లు, ఇయర్ బడ్స్‌తో పాటు ఇతర సాంకేతిక పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ (Apple iPhone)లతో పాటు పలు సంస్థలు కూడా వారి ఛార్జింగ్ పోర్ట్‌ను మార్చవలసి ఉంది. యూరోపియన్ కస్టమర్లకు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించే సంస్థలలో యాపిల్ ప్రధాన సరఫరాదారుడు, దీంతో ఈ నిర్ణయం ఐఫోన్ కంపెనీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ నిబంధన ఎందుకంటే! కస్టమర్లు డివైజ్ కొనుగోలు చేసిన ప్రతీసారి కంపెనీలు కొత్త ఛార్జర్లను కూడా ఇస్తుంటాయి. దీంతో పాతది వాడకుండా వ్యర్థంగా మారడం సహజంగా మారుతోంది. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించడంతో పాటు, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై ఈయూలో చాలా ఏళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సింగిల్ ఛార్జర్ వినియోగించడం వల్ల దాదాపు EUR 250 మిలియన్లు (దాదాపు రూ. 2016 కోట్లు) ఆదా అవుతుందని యూరోపియన్ కమిషన్ అంచనా. 2018లో మొబైల్ ఫోన్లతో విక్రయించిన సగం ఛార్జర్లు USB మైక్రో-USB కనెక్టర్‌ను కలిగి ఉండగా, 29 శాతం USB టైప్-సి కనెక్టర్‌ను కలిగి ఉన్నారు. 21 శాతం మంది లైట్నింగ్ కనెక్టర్ చార్జర్‌ను కలిగి ఉన్నారు. చదవండి: Youtube: యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! -
చవక ఎల్ఈడీ టీవీ.. రేటెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చిన రింగింగ్ బెల్స్ సంస్థ, చౌకగా ఎల్ ఈడీని మార్కెట్లోకి తీసుకొస్తామని మరో సంచలన ప్రకటనతో దుమ్మురేపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసిన కస్టమర్లకు మాత్రం షాకే ఎదురైంది. దాదాపు రూ.10 వేలకు 31.5 అంగుళాల హెచ్ డీ ఎల్ఈడీ టీవీని ఇవ్వనున్నట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. దీంతో టీవీ కూడా చౌకగా వస్తుందని ఆశపడిన వినియోగదారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ టీవీతో పాటు నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను ఢిల్లీ ఈవెంట్ లో రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. ఎల్ఈడీ టీవీ ధర రూ.9,900గాను, నాలు ఫీచర్ ఫోన్లు హిట్ - రూ.699, కింగ్ - రూ.899, బాస్ - రూ.999, రాజా -రూ.1099కు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సొగసైన 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్లను రూ.3,999, రూ.4,999 ధరలకు మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుతాయని కూడా రింగింగ్ బెల్స్ తెలిపింది. మొదటి దశగా 5,000 ఫోన్లను కంపెనీ డెలివరీ చేయనుంది. డెలివరీ చార్జీల కింద వినియోగదారులు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఒక్కో ఫ్రీడమ్ ఫోన్ పై వస్తున్న రూ.930 నష్టంతో పాటు.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లను మరిన్ని తయారీ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆ కంపెనీ ఆశ్రయించిందట. ఏకంగా రూ.50 వేల కోట్లను సహాయంగా అందించాలని ఆ కంపెనీ కోరినట్టు తెలుస్తోంది. నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరుతూ జూన్ 28నే ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ కంపెనీ లేఖ రాసిందని సమాచారం. ఒక్కో స్మార్ట్ ఫోన్ తయారీపై రూ.930 నష్టాన్ని కంపెనీ భరించిందని రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. మొత్తం ఈ ఫోన్ తయారీకి రూ.1180 ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. రూ.700-800లను యాప్ డెవలపర్లు, ప్రకటనల రెవెన్యూల నుంచి రికవరీ చేసుకున్నామని చెప్పారు. తర్వాత రూ. 251 (క్యాష్ ఆన్ డెలివరీ)లకు ఫోన్ అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో ఫోన్ పై రూ.180 నుంచి రూ.270 వరకు నష్టాలు వస్తాయని బావిస్తున్నట్టు గోయిల్ పేర్కొన్నారు.