సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు ఉధృతి నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని పేర్కొంది. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రూమర్ల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని హెచ్చరించింది. కాగా జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
Claim: A message on Facebook claiming strict #Lockdown from 18th June. #PIBFactCheck: It's #Fake. There is no such plan under consideration. Please beware of rumour mongers. pic.twitter.com/NqSXOpy9n9
— PIB Fact Check (@PIBFactCheck) June 14, 2020
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రెండురోజుల పాటు (16,17 తేదీలు) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్ననేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కాగా కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను దాదాపు 75 రోజులపాటు కేంద్రం కొనసాగించింది. జూన్ 8 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారిగా భారీగా సడలిస్తూ వచ్చింది. (చదవండి: హీరోయిన్ పెళ్లి: ఇన్‌స్టాలో వీడియో)
Comments
Please login to add a commentAdd a comment