ముంబై : అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న మహారాష్ర్టలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు గురువారం జరిపిన సమీక్షలో రాష్ర్టంలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రులు బాలాసాహెబ్ తోరత్ సహా ఇతర పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. కరోనా నివారణకు మే నెలఖారు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
(మహారాష్ట్రలో మహమ్మారి బారిన పోలీసులు)
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహారాష్ర్టలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు లాక్‌డౌన్ పొడిగింపే శరణ్యమని భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఉద్దవ్ తెలిపారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కార్మికులను పంపేటప్పడు ఆయా ప్రభుత్వాలతో అనుమతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రుణమాఫి పొందిన రైతలకు రుణాలు ఇవ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంకును కోరినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్నారు. దీనికి సంబందించి ఇప్పటికే ఆర్‌బీఐతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అధేవిధంగా రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment