
భారత ప్రొఫెషనల్స్‌కు ఉచిత వీసా గడవు పొడిగింపు ప్రకటించిన బ్రిటన్
లండన్ : బ్రిటన్‌లో భారత ప్రొఫెషనల్స్‌కు యూకే తీపికబురు అందించింది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న భారత్ సహా వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ హెల్త్‌కేర్ సిబ్బంది, ప్రొఫెషనల్స్‌కు వీసా గడవును మరింత పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. బ్రిటన్ హోంమంత్రి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ ఈ మేరకు ప్రకటించారు. అక్టోబర్ 1తో వీసా గడువు ముగియనున్న వైద్యులు, రేడియోగ్రాఫర్లు, సామాజిక కార్యకర్తలు, ఫార్మసిస్టుల వీసాలను ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ప్రీతి పటేల్ వెల్లడించారు. వీరందరికీ ఉచిత వీసా గడువు పొడిగింపు అందుబాటులోకి రానుంది.