సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు బీసీ స్టడీసర్కిళ్లలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించనున్న అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ కమిషనర్ ఎ.వాణీప్రసాద్ బుధవారం తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 5ను చివరి తేదీగా ప్రకటించారు. అర్హత పరీక్ష మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 16వ తేదీ ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను 11వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
సివిల్స్ శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
Published Thu, Nov 6 2014 2:32 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement