సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్‌జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
లిక్కర్ పాలసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment