బార్‌ లైసెన్సుల అనుమతి పొడిగింపు  | Extension Of Bar Licenses In Telangana | Sakshi
Sakshi News home page

బార్‌ లైసెన్సుల అనుమతి పొడిగింపు 

Published Mon, Sep 23 2019 3:05 AM | Last Updated on Mon, Sep 23 2019 3:05 AM

Extension Of Bar Licenses In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న బార్‌షాపుల అనుమతులను మరో ఏడాదికి పొడిగిస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 10 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు 2బీ బార్‌ లైసెన్సులను రెన్యువల్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వైన్‌షాపుల లైసెన్సుల కాలపరిమితి ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ఎక్సైజ్‌శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం చర్చించినట్లు తెలిసింది. సోమవారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement