SRH Vs MI: ఉప్పల్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు | IPL 2024: Hyderabad Metro Extend Metro Trains Timings For SRH Vs MI Match, See Details - Sakshi
Sakshi News home page

Metro Timings For SRH Vs MI Match: ఉప్పల్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Published Wed, Mar 27 2024 4:25 PM | Last Updated on Wed, Mar 27 2024 5:00 PM

IPL Match: Time Extension Of Metro Trains In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా నేడు ముంబై ఇండియ‌న్స్-స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. బుధ‌వారం రాత్రి 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ మార్గంలో మెట్రో రైలు స‌మ‌యం పొడిగించారు.

ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత స‌మ‌యానికి మించి న‌డుస్తాయ‌న్నారు. నాగోల్, ఉప్ప‌ల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్ల‌లో చివ‌రి రైళ్లు రాత్రి 12:15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1:10 గంట‌ల‌కు గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్ల‌డించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement