
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment