టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ఊరట | trump orders byte dance to divest in us tiktok in 90 days | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ఊరట

Published Sat, Aug 15 2020 2:43 PM | Last Updated on Sat, Aug 15 2020 4:28 PM

trump orders byte dance to divest in us tiktok in 90 days - Sakshi

వాషింగ్టన్ : టిక్‌టాక్‌ నిషేధం అంశంపై అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్ మరో కీలక అర్డర్ జారీ చేశారు. టిక్‌టాక్‌ విక్రయానికి దాని మాతృసంస్థ  బైట్‌డాన్స్‌కు మరో 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ మేరకు  కొత్త ఎగ్జిక్యూటివ్  ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. తద్వారా టిక్‌టాక్‌కు కొంత ఉపశమనం లభించింది.

జాతీయ భద్రతకు హాని కలిగిస్తోందనేందుకునమ్మదగిన ఆధారాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాల ఆధారంగా దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పుగా మారిన టిక్‌టాక్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్ము తున్నానంటూ ఆగస్టు 14 న (నిన్న) జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ గడువులోపల అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించుకోండి..లేదంటే వ్యాపారంపై నిషేధం తప్పదని స్పష్టం చేశారు. ఈ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం 90 రోజుల గడువు లోపల టిక్‌టాక్‌ను ఏదైనా అమెరికా సంస్థ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి నవంబర్, 12తో కొత్త గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఈ గడువు సెప్టెంబరు 15 వరకు మాత్రమే. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?

కాగా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని సొంతం చేసుకోవడానికి మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఈ కొనుగోలు ఒప్పందాన్ని బైట్‌డాన్స్ తప్పనిసరిగా విదేశీ పెట్టుబడుల కమిటీకి నివేదించాలని, గణనీయమైన భాగం తమ ట్రెజరీకి చేరాలని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement