ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించటాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్.. చీఫ్ జస్టిస్‌కు డీవై చంద్రచూడ్‌కు పంపించింది. తదుపరి ఈ పిటిషన్ లిస్ట్‌కు రావటం అనేది చీఫ్ జస్టిస్ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది.
అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంత బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్ జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాను. తన అనారోగ్యం రీత్యా వైద్య పరీక్ష చేయించుకోవటం కోసం బెయిల్ పొడగించాలని కోరారు. ఈ మేరకు తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు.
‘‘ఇది అరవింద్ కేజ్రీవాల్ విషయం. ఆయనకు మరో ఏడు రోజులు బెయిల్ పొడగించాలి’’ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘‘ బెయిల్ పొడగింపు పిటిషన్ ఇప్పుడు అత్యవసరంగా విచారించటం వీలు కాదు. అందుకే ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ముందుకు పంపుతున్నాం. ఆయన ఈ పిటిషన్ లిస్ట్ చేయటంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment