ముంబై: రూ.2 వేల నోట్ల ఉపసంహరణ గడువును రిజర్వ్ బ్యాంక్ మరో వారంపాటు, అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. మే 19వ తేదీ నుంచి మొదలైన రూ.2 వేల నోట్ల ఉపసంహరణ, మార్పిడి ప్రక్రియలో సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రజలు రూ. 3.42 లక్షల కోట్ల విలువైన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని శనివారం ఒక ప్రకటనలో ఆర్‌బీఐ వెల్లడించింది.
దేశంలో మే 19వ తేదీ వరకు చెలామణిలో ఉన్న కరెన్సీలో ఇది 96 శాతానికి సమానమని పేర్కొంది. ప్రస్తుతం రూ.14 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని తెలిపింది. అక్టోబర్ 7వ తేదీ తర్వాత కూడా రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని, అయితే ఆ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయా ల్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment