
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ వంటి ప్రముఖ కార్పోరేట్ కంపెనీలన్నీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రం హోం' ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రమ్ హోం పాలసీని వచ్చే ఏడాది జనవరి 8 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటినుంచే సమర్థవంతంగా పనిచేయగలిగేవారికి కాలపరిమితిని విస్తరిస్తున్నామని తెలిపింది. అయితే ఆఫీసులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది.
ఆఫీసులోకి ప్రవేశించే ముందు టెంపరేచర్ చెక్ చేసి అనుమతిస్తున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇంతకుముందు మే నెలలో అమెజాన్.. ఉద్యోగులకు అక్టోబర్ 2వరకు వర్క్ ఫ్రం హోం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటన జారీ చేసింది. ఉద్యోగుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమంటూ పేర్కొంది. (ఇక రిలయన్స్ రిటైల్‌పై ముకేశ్ దృష్టి! )
Comments
Please login to add a commentAdd a comment