
కోట్లిచ్చినా అలా అనరు!
‘‘సినిమా ఎంత వసూలు చేస్తుందనే దానికంటే.. ‘థియేటర్‌కు వెళ్లి చూడొచ్చు. ‘సిద్ధార్థ’ హిట్ సినిమా’ అని ప్రేక్షకులనే ఓ సౌండింగ్ ఉంటుంది చూశారూ! ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ మాటలు అనరు. సినిమాలో దమ్ము, కంటెంట్ ఉండాలి. అన్ని హెడ్ క్వార్టర్స్‌లో ఫస్ట్‌డే ఫస్ట్ షో హౌస్‌ఫుల్’’ అన్నారు దాసరి కిరణ్ కుమార్. సాగర్ హీరోగా కేవీ దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సిద్ధార్థ’ శుక్రవారం విడుదలైంది.
శనివారం సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘‘ఇంత మంచి సక్సెస్ ఇచ్చి, ఆదరించిన ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిది. ఈ క్రెడిట్ మా నిర్మాత కిరణ్ కుమార్‌గారిదే’’ అన్నారు సాగర్. హీరోయిన్ రాగిణి, దర్శకుడు కేవీ దయానంద్ రెడ్డి, రచయిత విస్సు, సమర్పకులు బుచ్చిరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.