టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్ | tdp mla bonda umamaheswara rao son arrested | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్

Published Thu, Oct 30 2014 2:55 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్ - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్

గుంటూరు: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన సిద్ధార్ధ్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి  చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు.

 

ఈ ప్రమాదంలో విద్యార్థి విజయ్ నాగేంద్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కార్ల రేసింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఆ విషయాన్ని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement