ఎలాంటి రోల్స్‌కైనా రెడీ!
‘‘ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరోగా ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా నటుడిగా మంచి పేరు, దర్శక- నిర్మాతల హీరో అనిపించుకోవాలనుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడా నికి నేను రెడీ’’ అన్నారు సాగర్. ఆయన హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ ఈ నెల 16న విడుదలవుతోంది. సాగర్ చెప్పిన సంగతులు...
♦ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లో చిన్న పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. ప్రేక్షకులు నా నుంచి అలాంటి పాత్రలు ఆశించడం లేదని అర్థమైంది. అదే నన్ను ‘సిద్ధార్థ’ వైపు నడిపించింది. ఈ మేకోవర్ కోసం ఏడాది కష్టపడ్డా. యాక్షన్ సీన్స్ కష్టమైనా ఇష్టపడి చేశా. రిజల్ట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
♦ గౌతమ బుద్ధుడిగా మారిన ‘సిద్ధార్థ’ మనకు తెలుసు. మా ‘సిద్ధార్థ’ లక్ష్యం ఏంటి? అతనేం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఓ ఎన్నారై యువకుడి ప్రేమకథ.
♦ మా చిత్ర దర్శకుడు కేవీ దయానంద్‌రెడ్డి గతంలో పవన్‌కల్యాణ్ టీమ్‌లో పదిహేనేళ్లు పనిచేశారు. ప్రతి విషయంలోనూ ఆయనకు మంచి పట్టుంది. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఏర్పడాలని పరు చూరి బ్రదర్స్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, దయా నంద్ వంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఎంతో ప్రేమతో చేసిన చిత్రమిది.
♦ ఓ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే.. మూవీ మేకింగ్, ప్లానింగ్, ప్రేక్షకులకు ఏయే అంశాలు నచ్చుతాయనే అంశాలపై అవగాహన ముఖ్యం. మా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అటువంటి వ్యక్తే. మా ఇద్దరి భావాలూ కలిశాయి. నా తదుపరి సినిమా ‘హరి’లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాను. కిరణ్‌కుమార్ గారి రామదూత క్రియేషన్స్, అవ్యక్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.