
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీని టేకోవర్ చేసే యత్నాల్లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) మెజారిటీ వాటాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టింది. కెఫే కాఫీ డే, ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు మైండ్‌ట్రీలో ఉన్న 3.27 కోట్ల షేర్లు (20.32 శాతం వాటాలు) మంగళవారం బ్లాక్ డీల్ ద్వారా ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేసింది.
ఇందుకోసం రూ. 3,210 కోట్లు వెచ్చించింది. స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్‌ఈకి కంపెనీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది. మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసేందుకు 66 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.