L&T Infotech
-
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్- న్యూజెన్.. జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, న్యూజెన్ సాఫ్ట్వేర్ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఒక దశలో న్యూజెన్ సాఫ్ట్వేర్ 20 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సైతం భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూజెన్ సాఫ్ట్వేర్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో న్యూజెన్ సాఫ్ట్వేర్ నికర లాభం ఏడు రెట్లు ఎగసి రూ. 29 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 155 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.9 శాతం నుంచి భారీగా 26.5 శాతానికి ఎగశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో న్యూజెన్ షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 251 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 270 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నికర లాభం 9.7 శాతం పెరిగి రూ. 457 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 2,998 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 2.8 శాతం బలపడి 22.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 15 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 3,078 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 6 శాతం దూసుకెళ్లి రూ. 3,139 వద్ద గరిష్టాన్ని తాకింది. -
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్@ రికార్డ్ హై
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 2273 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! క్యూ1 భేష్ సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 17 శాతం పుంజుకుని రూ. 415 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 19 శాతం పెరిగి రూ. 2,949 కోట్లను అధిగమించింది. పన్నుకు ముందు లాభం 17 శాతం ఎగసి రూ. 556 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 0.9 శాతం బలపడి 20.1 శాతానికి చేరాయి. జూన్ చివరికల్లా కంపెనీలో 31,477 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. ఉద్యోగ వలస రేటు 1.3 శాతం తగ్గడంతో 15.2 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. వార్షిక ప్రాతిపదికన వెల్లడించిన ఫలితాలివి. -
ఈ షేర్ల రికార్డుల ర్యాలీ చూడతరమా!
మార్కెట్లు జోరుమీదున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించింది. 321 పాయింట్లు జంప్‌చేసి 36,650కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు ఎగసి 10,791 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న పలు మిడ్ క్యాప్ కౌంటర్లు సరికొత్త గరిష్టాల రికార్డులను సృష్టిస్తున్నాయి. జాబితాలో తాజాగా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆల్కిల్ అమైన్స్, కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్, ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ చోటు సాధించాయి. కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఈ కౌంటర్లన్నీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ గత మూడు నెలల్లో 69 శాతం ర్యాలీ చేసిన ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 2360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2375ను తాకింది. మార్చి త్రైమాసికంలో ఆల్కిల్ అమైన్స్ పన్నుకు ముందు లాభం(ఇబిట్) 93 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను అధిగమించింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం సహకరించింది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గత ఆరు రోజుల్లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు 14 శాతం బలపడింది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 437ను అధిగమించింది. ప్రస్తుతం రూ. 435 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ ఈ కౌంటర్‌కు ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు ఏడాది కాలానికి రూ. 490 టార్గెట్ ధరను ప్రకటించింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆరు రోజుల్లో దాదాపు 8 శాతం పుంజుకున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ తాజాగా ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2079 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2098కు ఎగసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్) నుంచి కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల తయారీ ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత రూ. 1126 సమీపానికి చేరింది. ఇది 3.5 శాతం అధికంకాగా.. ప్రస్తుతం రూ. 1115 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ ఆటో రంగ కౌంటర్ 63 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సాధారణ వర్షపాత అంచనాలు, గ్రామీణ ఆదాయాలు పుంజుకోవడం, పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ముందు రోజు 4 శాతం ఎగసిన డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా మరో 4 శాతం జంప్‌చేసింది. ఎన్ఎస్ఈలో తొలుత రూ. 6,336ను తాకింది. ప్రస్తుతం రూ. 6212 వద్ద కదులుతోంది. కోవిడ్-19లోనూ జూన్ నెలలో కన్జూమర్ డ్యురబుల్స్ రంగం 100 శాతం రికవరీ సాధించిన వార్తలు ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
ఐవోఎల్- టాటా కన్జూమర్.. రికార్డ్స్
ఆటుపోట్ల మార్కెట్లోనూ హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్ కెమికల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్, సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీగా లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. ఐవోఎల్ కెమికల్స్ కంపెనీ బ్యాంక్ సౌకర్యాల(రుణ చెల్లింపుల)ను కేర్ రేటింగ్స్ తాజాగా A-నుంచి Aకు అప్‌గ్రేడ్ చేసిన వార్తలతో ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతంపైగా దూసుకెళ్లి రూ. 592ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా ప్రస్తుతం 5.3 శాతం ఎగసి రూ. 582 వద్ద ట్రేడవుతోంది. మార్చి 25 నుంచీ ఈ షేరు 302 శాతం ర్యాలీ చేయడం విశేషం! టాటా కన్జూమర్ విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ తాజాగా ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించిన నేపథ్యంలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 436ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.4 శాతం లాభంతో రూ. 431 వద్ద ట్రేడవుతోంది. పటిష్ట ఎఫ్ఎంసీజీ బ్రాండ్లకుతోడు బలమైన సీఈవోను కొత్తగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో అత్యుత్తమ రేటింగ్‌ను ప్రకటించనట్లు క్రెడిట్ స్వీస్ పేర్కొంది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 3 శాతానికిపైగా ఎగసి రూ. 2070ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 2048 వద్ద కదులుతోంది. గత ఐదు రోజుల్లో ఈ కౌంటర్ 7 శాతం పుంజుకుంది. -
ఎల్అండ్టీ ఇన్ఫో- టాటా పవర్ జూమ్
ఈ నెలాఖరువరకూ నాలుగోసారి లాక్‌డవున్ పొడిగించినప్పటికీ పలు ఆంక్షలను సడలించిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్ 149 పాయింట్లు పుంజుకుని 30,345కు చేరింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు బలపడి 8,925 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సాప్ట్వేర్ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, విద్యుత్ రంగ కంపెనీ టాటా పవర్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 427 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 13 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 3012 కోట్లను తాకింది. ఐటీ సర్వీసుల కంపెనీ ఫలితాలు త్రైమాసిక ప్రాతిపదికన పోల్చి చూసే సంగతి తెలిసిందే. క్యూ4లో 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా గత ఏడాది చివరికల్లా మొత్తం 8 పెద్ద డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 15.5 డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎల్అండ్టీ ఇన్ఫో షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1784 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1799 వరకూ ఎగసింది. టాటా పవర్ కంపెనీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టాటా పవర్ కంపెనీ రూ. 475 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 172 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 6621 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 1.55(155 శాతం) డివిడెండ్ ప్రకటించింది. మార్పిడి రహిత బాండ్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1500 కోట్లను సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం టాటా పవర్ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 34 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 35 సమీపానికి చేరింది. -
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లాభం 359 కోట్లు
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్(ఎల్టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ, సంజయ్ జలోన పేర్కొన్నారు. నిలకడ కరెన్సీ రేట్ల మారకం ప్రాతిపదికన ఆదాయంలో 12 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. డిజిటల్ సర్వీస్‌ల విభాగం మంచి వృద్ధిని సాధించిందని, తమ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా ఆదాయం 12 శాతం వృద్ధితో 36 కోట్ల డాలర్లకు చేరిందని వివరంచారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,347కు పెరిగిందని, ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 18.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,578 వద్ద ముగిసింది. -
మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీని టేకోవర్ చేసే యత్నాల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) మెజారిటీ వాటాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టింది. కెఫే కాఫీ డే, ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు మైండ్‌ట్రీలో ఉన్న 3.27 కోట్ల షేర్లు (20.32 శాతం వాటాలు) మంగళవారం బ్లాక్ డీల్ ద్వారా ఎల్అండ్టీ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 3,210 కోట్లు వెచ్చించింది. స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈకి కంపెనీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది. మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసేందుకు 66 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
ఎల్అండ్టీ ఇన్ఫో లాభం 33% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) నికర లాభం సుమారు 33 శాతం వృద్ధి చెంది రూ.375.5 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 282.8 కోట్లు. క్యూ3లో ఆదాయం 31 శాతం పెరిగి రూ. 1,884 కోట్ల నుంచి రూ. 2,473 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే నికర లాభం రూ. 400 కోట్ల నుంచి సుమారు 7 శాతం మేర క్షీణించగా, ఆదాయం మాత్రం రూ. 2,331 కోట్ల నుంచి 6 శాతం వృద్ధి సాధించింది. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి కంపెనీలో మొత్తం సిబ్బంది సంఖ్య 27,513గా ఉంది. ఎన్ఐఐటీ ఆదాయం రూ. 972 కోట్లు న్యూఢిల్లీ: ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ. 972 కోట్ల ఆదాయంపై రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే లాభం 33%, ఆదాయం 29% పెరిగాయి. 2017–18 క్యూ3లో ఆదాయం లాభం రూ. 76 కోట్లు. వివిధ మార్కెట్లలో విభాగాలన్నీ మెరుగ్గా రాణించడంతో ఆదాయం భారీగాగా పెంచుకోగలిగామని ఎన్ఐఐటీ టెక్ వైస్ చైర్మన్, ఎండీ అరవింద్ ఠాకూర్ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐ లాభం 239 కోట్లు న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ నికర లాభం సుమారు 3 శాతం వృద్ధి చెంది రూ. 239 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 232 కోట్లు. మరోవైపు మొత్తం ఆదాయం రూ. 2,020 కోట్ల నుంచి రూ. 2,416 కోట్లకు చేరింది. 2019 మే 1 నుంచి మరో అయిదేళ్ల పాటు భార్గవ్ దాస్‌గుప్తాను ఎండీ, సీఈవోగా కొనసాగించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎస్బీఐ లైఫ్ లాభంలో 15% వృద్ధి న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్బీఐ లైఫ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ. 264 కోట్లకు చేరింది. ఇది అంతక్రితం క్యూ3లో రూ.230 కోట్లు. ఆదాయం రూ.9,586 కోట్ల నుంచి రూ.12,156 కోట్లకు పెరిగింది. ఏయూఎం రూ. 1,11,630 కోట్ల నుంచి రూ. 1,34,150 కోట్లకు చేరింది. -
నేటి నుంచే ఎల్&టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
న్యూఢిల్లీ : దేశీయ ఆరో అతిపెద్ద ఐటీ సంస్థ ఎల్&టీ ఇన్ఫోటెక్ తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) నేటినుంచి ప్రారంభంకానుంది. తొలి పబ్లిక్ ఆఫర్ తో కంపెనీ రూ.1,243 కోట్లను సమీకరించనుంది. రూ.1.75 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో అమ్మకానికి ఉంచనుంది. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.705-710గా నిర్ణయించింది. రూ.710 ధరతో రూ.1,243.50 కోట్లను...రూ.705 ధరతో రూ.1,233.75 కోట్లను కంపెనీ సమీకరించాలనుకుంటోంది. నేటి నుంచి జూలై 13 వరకూ ఈ సబ్ స్క్రిప్షన్ కొనసాగనుంది. ఈ ఆఫర్ తో మార్కెట్లో ఎల్&టీ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎన్ఎస్ఈ లో ఎల్&టీ రూ.28.80 లాభపడి రూ.1561.80గా నమోదవుతోంది. యాంకర్ పెట్టుబడిదారులకు రూ.710 లకు షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఇప్పటికే రూ.373 కోట్లను కంపెనీ సమీకరించింది. కొటక్ మహింద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యురిటీస్ ఈ ఇష్యూను మేనేజ్ చేయనున్నాయి. ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవెన్యూలను వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.13,500 కోట్లకు(2 బిలియన్ డాలర్లకు) పెంచనున్నట్టు ఎల్&టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏమ్ నాయక్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎల్&టీ ఇన్ఫోటెక్ రెవన్యూలు, ఇతర ఆదాయాలు రూ.6,143.02 కోట్లకు పెరిగాయి. పన్నుల తర్వాత లాభాలు రూ.922.17 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూల పరంగా, ఉద్యోగుల పరంగా భారతీయ ఐటీ సర్వీసులో ఎల్&టీ ఇన్ఫోటెక్ ఆరవ అతిపెద్ద కంపెనీగా ఉంది. -
సత్యం దక్కకపోవడం దురదృష్టకరం
* ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ * నంబర్ 1 స్థానానికి చేరుకుంటాం: నాయక్ న్యూఢిల్లీ: ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ఎల్ఎండ్టీ సొంతం చేసుకోకపోవడం దురదృష్టకరంగా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఏఎం నాయక్ అభిప్రాయపడ్డారు. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకలు వెలుగు చూడడంతో ప్రభుత్వం కల్పించుకుని తర్వాత దాన్ని వేలం వేయడం, మహింద్రా గ్రూపు కొనుగోలు చేయడం తెలిసిందే. సత్యంలో అవకతవకల గురించి కంపెనీ అప్పటి చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు స్వయంగా ప్రకటించడంతో షేరు ధర ఓ దశలో రూ.6.30కి పడిపోయింది. దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన సత్యం కంప్యూటర్స్‌లో ఎల్అండ్టీఅప్పటికే వాటాలు కలిగి ఉండీ దాన్ని దక్కించుకోకపోవడంపై నాయక్ తన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చివరిలో చేజారింది..: ‘సత్యం కంప్యూటర్స్‌ను సొంతం చేసుకునేందుకు మేము ముందు నుంచీ ప్రయత్నించాం. సత్యం కంప్యూటర్స్ షేర్ ధర పతనం మొదలైన తర్వాత రూ.210 దగ్గర, రూ.125 స్థాయిలో కూడా కొనుగోళ్లు జరిపాం. తర్వాత కూడా జరిపిన కొనుగోళ్లతో సగటున ఓ షేరు కొనుగోలు ధర రూ.80 రూపాయలుగా ఉంది. వేలంలో సత్యం కంప్యూటర్స్ షేరు ధర రూ.55-60 మధ్యలో ఉంటుందని భావించాం. అప్పటికే రూ.80 పెట్టి షేర్లు కొన్నందున... సగటు కొనుగోలు ధర తగ్గించుకునేందుకు రూ.47 కోట్ చేయాలని నిర్ణయించాం. అప్పుడు మొత్తం మీద సగటు ధర రూ.58 అవుతుంది. అయితే, మహీంద్రా సత్యం షేర్లను కొనుగోలు చేసి లేదు కనుక ఆలస్యంగా రంగంలోకి వచ్చినా షేర్‌కు 57-58 రూపాయలుగా బిడ్ వేసింది. దాంతో సత్యం ఆ కంపెనీ పరమైంది. ఇది దురదృష్టకరం. అయితే, ఎల్ అండ్ టీ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీని సృష్టించింది. 90 కోట్ల డాలర్ల ఆదాయంతో, 20వేల మంది ఉద్యోగులతో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ స్థాయికి చేరుకుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు స్థాయి 200 కోట్ల డాలర్లకు తీసుకెళ్లడంతోపాటు ఐటీ టెక్నాలజీ రంగంలోనూ ఎల్అండ్టీని అగ్రపథంలో నిలబెట్టడమే మా అంతిమ లక్ష్యం’’ అని నాయక్ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ బలమైన నాయకత్వం చేతిలోనే.. 52 సంవత్సరాలుగా ఎల్అండ్టీ కంపెనీతో కలసి ప్రయాణిస్తూ 18 ఏళ్లుగా తన నాయకత్వంలో కంపెనీని అగ్రగామిగా నిలబెట్టిన ఏఎం నాయక్ (74)... వచ్చే ఏడాది తన బాధ్యతలను తన వారసుడు ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేతికి 2017 అక్టోబర్ 1న అప్పగించనున్నారు. ఈ పరిణామాలపై నాయక్ మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. * ఎల్ అండ్ నా జీవితం. భార్య, పిల్లలకు మించి ఎల్అండ్టీకి ప్రాధాన్యం ఉంటుంది. నా తర్వాత కూడా కంపెనీ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తాను. * నా స్థానంలో వచ్చే వారికి పరిస్థితులు అంత సులువు కాదు. అయితే, ఎల్అండ్టీ భవిష్యత్తులోనూ బలమైన నాయకత్వం చేతిలోనే, దృఢంగానే ఉంటుంది. * సుబ్రహ్మణ్యన్ ప్రస్తుతం ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్, ప్రెసిడెంట్ బాధ్యతలు చూస్తున్నారు. * మొదట షిప్‌బిల్డింగ్ బాధ్యతలు, తర్వాత హైదరాబాద్ మెట్రో పర్యవేక్షణ బాధ్యతలు సుబ్రహ్మణ్యన్‌కు అప్పగించాను. ఆ తర్వాత క్రమంగా ఐటీ వ్యాపారంలోకి తీసుకొచ్చాను. ఏడాదిగా మరిన్ని బాధ్యతలు అప్పగించాను. ఓ మార్గదర్శకుడిగా నేను చేయాల్సింది చేశా. * దేశంలో తయారీ, ప్రాజెక్టుల వ్యాపార రంగంలో ప్రతిభగల నాయకుల కొరత ఉంది. ఈ పరిస్థితి ఎల్అండ్టీ గ్రూపు వంటి వాటికి మరింత ఇబ్బందికరం. ఐఐటీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఉన్నవారు కూడా ఐటీ, టెక్నాలజీ, ఫైనాన్షియల్ రంగాల్లో పనిచేస్తున్నారు. దీంతో మేమే సాన పెట్టే కార్యక్రమాన్ని అంతర్గతంగా చేపట్టాం. దీంతో ఐఐటీ పట్టభద్రుల కంటే స్మార్ట్‌గా తయారవుతారు. నేటి నుంచి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ లార్సెన్ అండ్ టుబ్రో అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 13న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని అంచనా. ఈ ఐపీఓకు ధర శ్రేణి రూ.705-710. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 20 షేర్లకు బిడ్ చేయాలి. ఈ ఐపీఓలో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.710 ధరకు యాంకర్ ఇన్వెస్టర్లకు విక్రయించడం ద్వారా కంపెనీ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది.