బిగ్‌బాస్‌: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా! | Bigg Boss 13: Koena Accidentally Sees Siddhartha Dey Naked In Bathroom | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అతను ఉండగానే బాత్రూంలోకి..

Oct 12 2019 11:24 AM | Updated on Oct 12 2019 11:51 AM

Bigg Boss 13: Koena Accidentally Sees Siddhartha Dey Naked In Bathroom - Sakshi

బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 13కు ఎన్ని వివాదాలు ఎదురైనప్పటికీ హోస్ట్‌ సల్మాన్‌ఖాన్‌ షోను పరుగులు పెట్టిస్తున్నాడు. పైగా ఇందులో పాల్గొంటున్న అందరూ సెలబ్రిటీలే కావడం షోకు అదనపు ఆకర్షణగా మారింది. ఇక ఈ షోలో పాల్గొంటున్న కొయినా మిత్ర ఇబ్బందికర అనుభవాన్ని ఎదుర్కొంది. తాజా ఎపిసోడ్‌లో తోటి కంటెస్టెంట్‌ సిద్ధార్థ డే బాత్రూం గడియ పెట్టుకోకుండా స్నానం చేస్తున్నాడు. ఆ విషయం తెలియని కొయినా నేరుగా డోర్‌ తెరిచి బాత్రూంలోకి వెళ్లబోయింది. ఈ హఠాత్పరిణామంతో అతను గట్టిగా కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న పరాస్‌ చాబ్రా, మహీరా శర్మ ఏం జరిగిందంటూ కొయినాను అడిగారు. అప్పటికీ షాక్‌లోనే ఉన్న కొయినా కాసేపటికి తేరుకుని జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది.

దీంతో పరాస్‌, మహీరా పగలబడి మరీ నవ్వారు. అనుకోకుండా జరిగింది అంటూ కొయినా వాళ్లకు సంజాయిషీ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని మళ్లీ సిద్ధార్థ డేకు గుర్తు చేసి అతన్ని ఇబ్బందిపెట్టకండి అని కోరింది. ముఖ్యంగా ఇంటి సభ్యులకు ఎవరికీ చెప్పకండి అని కొయినా వేడుకుంది. అయితే వాళ్లు ఆమె మాటలను పట్టించుకోలేదు. పరాస్‌ వెళ్లి అసిమ్‌తో చెప్పగా అతను ఇంటి సభ్యులందరికీ చాటింపు వేశాడు. దీంతో సిద్దార్థ్‌ డే స్నానం చేసి బయటికి రాగానే షేమ్‌ షేమ్‌ అంటూ పాటలు పాడుతూ ఇంటి సభ్యులు అతన్ని ఆటపట్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement