Koena Mitra
-
రణ్‌వీర్‌కు వెర్రి ఎక్కువ.. తన నుంచి ఇది ఆశించడం సహజమే: నటి
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. దీనిని కొందరు రణ్వీర్ను ప్రశంసిస్తోంటే మరికొందరు తప్పు బడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన మహిళల మనోభవాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రణ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ దీనిని ఖండిస్తూ ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రణ్‌వీర్‌కు మద్దతుగా నిచ్చాడు. తాజాగా నటి, మోడల్ కోయినా మిత్రా సైతం రణ్‌వీర్‌ని సమర్థించింది. రణవీర్ సాహసం చేశాడంటూ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భందగా రణ్వీర్ నగ్నఫొటోషూట్పై స్పందిస్తూ అందులో తప్పేముందంటూ వెనకెసుకొచ్చింది. ‘రణ్వీర్ గురించి అందరికి తెలిసిందే. ప్రయోగాలు చేసే నటుల్లో ఆయన ముందుంటాడు. తొటి నటీనటుల పట్ల, ప్రజల పట్ల, ఫ్యాన్స్‌తో చాలా సరదాగా ఉంటాడు. ఆయన చిల్డ్ అవుట్ గాయ్. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు. ఆయనకు కాస్తా వెర్రి ఎక్కువ. దానితోనే అందరిని ఆకర్షిస్తాడు. స్క్రీన్‌పై అయినా స్టేజ్‌పై ఆయినా తన ఎనర్జీ అంటే నాకు ఇష్టం. రణ్వీర్ మిగతా నటుల కంటే కొంచం భిన్నం. అలాంటి తను ప్రజలను ఆకర్షించడానికి ఇలా చేశాడంటే నేను ఒప్పకొను. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. తనో స్టార్. ఇది కేవలం సరదా కోసం, కాస్తా క్రేజీగా ఉండేందు ఇలా చేశాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ఫన్‌తో ఈ ఫొటోలు షేర్ చేసి ఉంటాడు. కానీ భారతీయులు ఎప్పుడు ఇతరులను జడ్జ్ చేయడంలో ముందుంటారు కదా’ అంటూ చెప్పుకొచ్చింది. -
ప్లాస్టిక్ సర్జరీ.. మూడేళ్లు నరకం చూపించారు
Koena Mitra Recalls Her Struggle: బాలీవుడ్లో నెపోటిజం, గ్రూపిజం కొత్తేమీ కాదు. వీటివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు నటీనటులు బాహాటంగానే నోరు విప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా దీనిపై స్పందించింది. 'ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాటివల్ల నేనూ ఇబ్బందులకు లోనయ్యాను. నేను అవుట్ సైడర్(సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి) అయినప్పటికీ ఇండస్ట్రీలో నేను కూడా మంచి బ్రేక్ అందుకున్నాను. కానీ నాకవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నాకోసం వారు పెదవి విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు నాకెప్పుడూ ఉంటుంది' 'ఇక నా ప్లాస్టిక్ సర్జరీ అంటారా? అది పూర్తిగా నా నిర్ణయం. నా ఫేస్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాలకేంటి సమస్య? ఇలా సర్జరీ గురించి ఓపెన్‌గా చెప్పొద్దన్న విషయం నాకు తెలియదు. నన్ను దాని గురించి అడిగారు కాబట్టే అవును చేయించుకున్నానని వివరాలన్నీ చెప్పాను. ఆ మాత్రందానికి నన్ను నానామాటలు అన్నారు. నామీద వ్యతిరేక వార్తలు రావౠరు. ఇండస్ట్రీలో అయితే చాలామంది నాతో దూరం పాటించారు. అది నా కెరీర్‌ను దెబ్బతీసింది. మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు. ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్‌గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్రా. -
బిగ్‌బాస్: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!
బిగ్‌బాస్ హిందీ సీజన్ 13కు ఎన్ని వివాదాలు ఎదురైనప్పటికీ హోస్ట్ సల్మాన్‌ఖాన్ షోను పరుగులు పెట్టిస్తున్నాడు. పైగా ఇందులో పాల్గొంటున్న అందరూ సెలబ్రిటీలే కావడం షోకు అదనపు ఆకర్షణగా మారింది. ఇక ఈ షోలో పాల్గొంటున్న కొయినా మిత్ర ఇబ్బందికర అనుభవాన్ని ఎదుర్కొంది. తాజా ఎపిసోడ్లో తోటి కంటెస్టెంట్ సిద్ధార్థ డే బాత్రూం గడియ పెట్టుకోకుండా స్నానం చేస్తున్నాడు. ఆ విషయం తెలియని కొయినా నేరుగా డోర్ తెరిచి బాత్రూంలోకి వెళ్లబోయింది. ఈ హఠాత్పరిణామంతో అతను గట్టిగా కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న పరాస్ చాబ్రా, మహీరా శర్మ ఏం జరిగిందంటూ కొయినాను అడిగారు. అప్పటికీ షాక్‌లోనే ఉన్న కొయినా కాసేపటికి తేరుకుని జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో పరాస్, మహీరా పగలబడి మరీ నవ్వారు. అనుకోకుండా జరిగింది అంటూ కొయినా వాళ్లకు సంజాయిషీ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని మళ్లీ సిద్ధార్థ డేకు గుర్తు చేసి అతన్ని ఇబ్బందిపెట్టకండి అని కోరింది. ముఖ్యంగా ఇంటి సభ్యులకు ఎవరికీ చెప్పకండి అని కొయినా వేడుకుంది. అయితే వాళ్లు ఆమె మాటలను పట్టించుకోలేదు. పరాస్ వెళ్లి అసిమ్తో చెప్పగా అతను ఇంటి సభ్యులందరికీ చాటింపు వేశాడు. దీంతో సిద్దార్థ్ డే స్నానం చేసి బయటికి రాగానే షేమ్ షేమ్ అంటూ పాటలు పాడుతూ ఇంటి సభ్యులు అతన్ని ఆటపట్టించారు. -
గదిలో బంధించి తాళం వేశాడు: నటి
ముంబై : ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా రియాలిటీ షో బిగ్‌బాస్ టీఆర్పీ రేట్లలో దూసుకుపోతోంది. నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. బిగ్‌బాస్ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్దార్థ్ డే, ఆర్తీ సింగ్, ఆసిమ్ రియాజ్, అబూ మాలిక్, షఫాలీ బగ్గా, మహీరా శర్మ వంటి సినీ సెలబ్రిటీలతో బిగ్‌బాస్ హౌజ్ నిండిపోయింది. ఈ క్రమంలో ఒక్కో సెలబ్రిటీ ఇప్పుడిప్పుడే ఇతర ఇంటి సభ్యులతో క్లోజ్ అవుతున్నారు. తమ వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్ కోయినా మిత్రా ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ తోటి సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ‘ కొన్నేళ్ల క్రితం టర్కీకి చెందిన వ్యక్తిని ఎంతగానో ప్రేమించాను. మొదట్లో బాగానే ఉండేవాడు. కానీ రాను రాను తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తను చాలా పొసెసివ్. మన పెళ్లి అయ్యాక టర్కీలోనే ఉండాలని చెప్పాడు. అప్పుడు నువ్వేం చేస్తావు. నన్ను ఎలా చూసుకుంటావు అని అడిగాను. ఇందుకు బదులుగా మొదట నా పాస్‌పోర్టు కాల్చి పడేస్తానని చెప్పాడు. టర్కీ దాటి ఎక్కడికీ వెళ్లనివ్వనని, తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని చెప్పాడు. అంతేకాదు ఓసారి ముంబైలో మేమిద్దరం నా అపార్టుమెంటులో ఉన్న సమయంలో సైకోలా ప్రవర్తించాడు. నన్ను బాత్రూంలో బంధించి తాళం వేసి వెళ్లిపోయాడు. నేను ఏ పని చేయడానికి వీళ్లేదని.. అందుకోసం బయటికి వెళ్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. తన ప్రవర్తనతో విసిగిపోయి బంధానికి స్వస్తి పలికాను’ అని ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి ఇంటి సభ్యులతో షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని కెరీర్‌పై దృష్టి సారించానని చెప్పుకొచ్చింది. -
నటికి ఫోన్ చేసి.. లైంగికంగా వేధించాడు
కేసు నమోదు చేసిన నటి ముంబై: ఫోన్ చేసి తనను లైంగికంగా వేధిస్తున్న ఓ గుర్తు తెలియని కీచకుడిపై బాలీవుడ్ నటి కోయినా మిత్రా ఇటీవల కేసు నమోదు చేసింది. తనకు ఫోన్ చేసి ఒక రాత్రికి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై ముంబైలోని ఒషివరా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శనివారం చేసిన ఆమె ఫిర్యాదు ప్రకారం.. గత వారం రోజుల్లో 40-50 గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి ఆమెకు కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్‌ను ఆమె మొదట పట్టించుకోలేదు. కానీ శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేసింది. కాలర్ అసభ్యంగా మాట్లాడుతూ ఒక రాత్రికి వస్తావా? డబ్బు ఇస్తానంటూ నీచంగా వ్యవహరించాడు. నటిని దూషించాడు. కాసేపు వేధించిన అనంతరం అతను ఫోన్ పెట్టాడు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 509 (మహిళల మర్యాదకు భంగం కలిగించేలా దూషించడం, ప్రవర్తించడం) కింద కేసు నమోదు చేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రోడ్, హే బేబీ, ఏక్ హాసీనా ఏక్ ఖిలాడీ, ముసాఫిర్ వంటి సినిమాల్లో నటించిన కోయినా మిత్రా పలు ఐటెం సాంగ్స్‌తో బాలీవుడ్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. -
'ఐటం గర్ల్' ఇంట్లో భారీ చోరీ
ముంబై: ఒకానొక దశలో అటు నార్త్‌నే కాక ఇటు సౌత్నూ ఐటమ్ సాంగ్స్ తో తెగ ఊపేసిన కోయినా మిత్రా.. ప్రస్తుతం భారీ అవకాశాలు లేక చిన్నాచితకా హిందీ సినిమాలు చేసుకుంటోంది. ఇంతలోనే ఆమెకు ఆర్థిక పరంగా భారీ షాక్ తగిలింది. గత ఆదివారం ఆమె ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.1.20 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. షూటింగ్ నుంచి వచ్చేసరికి నగలు మాయం కావడంతో అవాక్కయిన కోయినా.. హుటాహుటిన ఒశివారా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేసింది. ఇన్ స్పెక్టర్ సుభాష్ ఖండేల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ కు చెందిన ఓ మహిళ గత ఏడేళ్లుగా కోయినా మిత్రా ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తోంది. ఇంట్లో ఏయే వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలుసు. గత ఆదివారం బీరువా లాకర్ లో నుంచి రూ.1.25 లక్షల విలువైన నగలు పోయాయి. ఆ నగలను పనిమనిషే దొంగిలించి ఉంటుందని, బీరువా డూప్లికేట్ తాళం ఎక్కడుంటుందో ఆమెకు మాత్రమే తెలుసని కోయినా వాదిస్తోంది. పైగా కొంత కాలం కిందట సదరు పనిమనిషి.. తన కూతురి చదువు కోసం డబ్బు కావాలని అడిగిందని, అందుకు నిరాకరించినందుకే ఈ పని చేసి ఉంటుందని కోయినా చెబుతోంది. ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.