నటికి ఫోన్‌ చేసి.. లైంగికంగా వేధించాడు | actress Koena Mitra sexually harassed by pervert | Sakshi
Sakshi News home page

నటికి ఫోన్‌ చేసి.. లైంగికంగా వేధించాడు

Published Tue, Aug 1 2017 11:00 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

నటికి ఫోన్‌ చేసి.. లైంగికంగా వేధించాడు - Sakshi

నటికి ఫోన్‌ చేసి.. లైంగికంగా వేధించాడు

కేసు నమోదు చేసిన నటి

ముంబై: ఫోన్‌ చేసి తనను లైంగికంగా వేధిస్తున్న ఓ గుర్తు తెలియని కీచకుడిపై బాలీవుడ్‌ నటి కోయినా మిత్రా ఇటీవల కేసు నమోదు చేసింది. తనకు ఫోన్‌ చేసి ఒక రాత్రికి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన వ్యక్తిపై ముంబైలోని ఒషివరా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం చేసిన ఆమె ఫిర్యాదు ప్రకారం.. గత వారం రోజుల్లో 40-50 గుర్తుతెలియని ఫోన్‌ నంబర్ల నుంచి ఆమెకు కాల్స్‌ వచ్చాయి. ఈ కాల్స్‌ను ఆమె మొదట పట్టించుకోలేదు.

కానీ శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వచ్చిన కాల్‌ను లిఫ్ట్‌ చేసింది. కాలర్‌ అసభ్యంగా మాట్లాడుతూ ఒక రాత్రికి వస్తావా? డబ్బు ఇస్తానంటూ నీచంగా వ్యవహరించాడు. నటిని దూషించాడు. కాసేపు వేధించిన అనంతరం అతను ఫోన్‌ పెట్టాడు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై సెక్షన్‌ 509 (మహిళల మర్యాదకు భంగం కలిగించేలా దూషించడం, ప్రవర్తించడం) కింద కేసు నమోదు చేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రోడ్‌, హే బేబీ, ఏక్‌ హాసీనా ఏక్‌ ఖిలాడీ, ముసాఫిర్‌ వంటి సినిమాల్లో నటించిన కోయినా మిత్రా పలు ఐటెం సాంగ్స్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement