'ఐటం గర్ల్' ఇంట్లో భారీ చోరీ | Bollywood actress Koena Mitra robbed of Rs.1.20 lakh | Sakshi
Sakshi News home page

'ఐటం గర్ల్' ఇంట్లో భారీ చోరీ

Published Tue, Oct 20 2015 9:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఐటం గర్ల్' ఇంట్లో భారీ చోరీ - Sakshi

'ఐటం గర్ల్' ఇంట్లో భారీ చోరీ

ముంబై: ఒకానొక దశలో  అటు నార్త్నే కాక ఇటు సౌత్నూ ఐటమ్ సాంగ్స్ తో తెగ ఊపేసిన కోయినా మిత్రా..  ప్రస్తుతం భారీ అవకాశాలు లేక చిన్నాచితకా హిందీ సినిమాలు చేసుకుంటోంది. ఇంతలోనే ఆమెకు ఆర్థిక పరంగా భారీ షాక్ తగిలింది. గత ఆదివారం ఆమె ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.1.20 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. షూటింగ్ నుంచి వచ్చేసరికి నగలు మాయం కావడంతో అవాక్కయిన కోయినా.. హుటాహుటిన ఒశివారా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేసింది. ఇన్ స్పెక్టర్ సుభాష్ ఖండేల్కర్ తెలిపిన వివరాల ప్రకారం..

పంజాబ్ కు చెందిన ఓ మహిళ గత ఏడేళ్లుగా కోయినా మిత్రా ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తోంది. ఇంట్లో ఏయే వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలుసు. గత ఆదివారం బీరువా లాకర్ లో నుంచి రూ.1.25 లక్షల విలువైన నగలు పోయాయి. ఆ నగలను పనిమనిషే దొంగిలించి ఉంటుందని, బీరువా డూప్లికేట్ తాళం ఎక్కడుంటుందో ఆమెకు మాత్రమే తెలుసని కోయినా వాదిస్తోంది. పైగా కొంత కాలం కిందట సదరు పనిమనిషి.. తన కూతురి చదువు కోసం డబ్బు కావాలని అడిగిందని, అందుకు నిరాకరించినందుకే ఈ పని చేసి ఉంటుందని కోయినా చెబుతోంది. ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement