Koena Mitra Recalls Her Struggle: బాలీవుడ్‌లో నెపోటిజం, గ్రూపిజం కొత్తేమీ కాదు. వీటివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామంటూ పలువురు నటీనటులు బాహాటంగానే నోరు విప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కొయినా మిత్రా కూడా దీనిపై స్పందించింది. 'ఇండస్ట్రీలో నెపోటిజం, గ్రూపు రాజకీయాలు ఉన్నాయన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే వాటివల్ల నేనూ ఇబ్బందులకు లోనయ్యాను. నేను అవుట్ సైడర్(సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి) అయినప్పటికీ ఇండస్ట్రీలో నేను కూడా మంచి బ్రేక్ అందుకున్నాను. కానీ నాకవసరం అయినప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నాకోసం వారు పెదవి విప్పి మాట్లాడలేదన్న ఫిర్యాదు నాకెప్పుడూ ఉంటుంది'
'ఇక నా ప్లాస్టిక్ సర్జరీ అంటారా? అది పూర్తిగా నా నిర్ణయం. నా ఫేస్, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే జనాలకేంటి సమస్య? ఇలా సర్జరీ గురించి ఓపెన్‌గా చెప్పొద్దన్న విషయం నాకు తెలియదు. నన్ను దాని గురించి అడిగారు కాబట్టే అవును చేయించుకున్నానని వివరాలన్నీ చెప్పాను. ఆ మాత్రందానికి నన్ను నానామాటలు అన్నారు. నామీద వ్యతిరేక వార్తలు రావౠరు. ఇండస్ట్రీలో అయితే చాలామంది నాతో దూరం పాటించారు. అది నా కెరీర్‌ను దెబ్బతీసింది. మూడేళ్లు నాకు నరకం అంటే ఏంటో చూపించారు. ధైర్యంగా ఉండండి అంటూ హితబోధ చేస్తున్నవారు మీడియా ముందుకు వచ్చి మాత్రం నాకు సపోర్ట్‌గా మాట్లాడరు అని చెప్పుకొచ్చింది కొయినా మిత్రా.
Comments
Please login to add a commentAdd a comment