బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్‌లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్‌మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.
తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.
ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్‌లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment