botox injection
-
ఆ అవసరం ఇంకా రాలేదన్న చిరంజీవి హీరోయిన్.. రూమర్స్‌పై స్పందించిన నటి!
బాలీవుడ్ భామ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. టాలీవుడ్లో మెగాస్టార్ సరసన అందరివాడు చిత్రంలో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా ఈ బాలీవుడ్ భామ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి.తాజాగా తనపై వస్తున్న వార్తలపై రిమీ సేన్ స్పందించింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న కథనాలు అవాస్తవమని తెలిపింది. కేవలం ఫిల్లర్, బోటాక్స్(ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా థెరపీ) చికిత్స మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించింది. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అవసరమైతే 50 ఏళ్లు దాటిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని రిమీసేన్ పేర్కొంది.ప్రస్తుతం తనకు ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తున్నారని వివరించింది. తాను అందంగా కనిపించేందుకు వారు ఎంతగానో సహకరిస్తున్నారని రిమీ తెలిపింది. ఇటీవల తన ఫోటోలు చూసి అభిమానులు ఇష్టపడుతున్నారని నటి పేర్కొంది. కాగా.. రిమీ సేన్ చివరిసారిగా 2011లో వచ్చిన షాగిర్డ్ చిత్రంలో నటించింది. ఆమె సినిమాకు దూరమై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. బాలీవుడ్లో దీవానే హుయే పాగల్, గరం మసాలా, హ్యాట్రిక్, జానీ గద్దర్, దే తాలీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Rimi Sen (@subhamitra03) -
ఆడవాళ్లను మగవాళ్లు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా?
టేకిట్ ఈజీ మగవాళ్లు ఆడవాళ్లను ఎందుకు ప్రేమిస్తారు? నేనైతే చెప్పను గానీ, ఒక పాఠకుడు చెప్పిన దాన్ని మీకు చెబుతాను. అంతమాత్రాన నేను ప్రతి పదంతో ఏకీభవించినట్లు కాదని మనవి (ఇప్పటికే దక్షిణ అమెరికన్ రచయిత ఒకరు నన్ను పురుష దురంహకార రచయిత అన్నారు. అందుకే...నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిది కదా!) - పాలో కోయిలో, ప్రముఖ రచయిత పురుషులు స్త్రీలను ప్రేమించడానికి కొన్ని కారణాలు... * వయసు ముందుకు వెళ్లిపోతున్నా...ఏ వయసు దగ్గర ఉండాలో అక్కడే ఉంటారు. అంగుళమైనా కదలరు. * వీధుల్లో నడుస్తున్నప్పుడు సూటిగా నడవడం తప్ప చుట్టూ చూడరు. ఎవరైనా పురుషుడు పలకరింపుగా నవ్వినా స్పందించరు. * ఇంటి బాగోగుల కోసం ఎంతో పని చేస్తారు. పాపం...గుర్తింపును మాత్రం ఆశించరు. * అశ్లీల సాహిత్యం జోలికి వెళ్లరు. * అందచందాల కోసం బొటాక్స్ ఇంజెక్షన్లు వేయించుకోవడం, వాక్స్లు చేయించుకోవడం, వ్యాయామాలు చేస్తుంటారుగానీ... ఈ త్యాగాల గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. * మైకేల్ ఏంజిలో చిత్రాన్ని శ్రద్ధగా పెయింట్ చేస్తున్నట్లు, తమ ముఖాలను పెయింట్ చేసుకుంటారు. *‘నేను ఎలా ఉంటాను? బాగుంటానా?’ లాంటి ప్రశ్నలు సాటి మహిళలను తప్ప మగవాళ్లను అడిగి ఇబ్బంది పెట్టరు. * సమస్యలను తమదైన శైలిలో పరిష్కరిస్తారు. అవి ఒక పట్టాన మగవాళ్లకు అర్థం కావు. * పురుష దుస్తులతో కూడా ఆఫీసుకు వెళ్లగలరు. మరి మగవాళ్లు స్కర్ట్ ధరించి ఆఫీసుకు వెళ్లగలరా? * ‘ఫలానా అమ్మాయి బాగుంది’ అని అంటే ‘మీ టేస్ట్ మీ ముఖం లాగే ఉంది’ అని మన టేస్ట్ తాలూకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. * సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోని ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటారు.