ఆడవాళ్లను మగవాళ్లు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? | When a Men Loves Women, some reasons | Sakshi
Sakshi News home page

ఆడవాళ్లను మగవాళ్లు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా?

Published Wed, Jul 23 2014 8:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

ఆడవాళ్లను మగవాళ్లు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా?

ఆడవాళ్లను మగవాళ్లు ఎందుకు ప్రేమిస్తారో తెలుసా?

టేకిట్ ఈజీ
 
మగవాళ్లు ఆడవాళ్లను ఎందుకు ప్రేమిస్తారు? నేనైతే చెప్పను గానీ, ఒక పాఠకుడు చెప్పిన దాన్ని మీకు చెబుతాను. అంతమాత్రాన నేను ప్రతి పదంతో  ఏకీభవించినట్లు కాదని మనవి (ఇప్పటికే దక్షిణ అమెరికన్ రచయిత ఒకరు నన్ను పురుష దురంహకార రచయిత అన్నారు. అందుకే...నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిది కదా!)

- పాలో కోయిలో, ప్రముఖ రచయిత

 పురుషులు స్త్రీలను ప్రేమించడానికి కొన్ని కారణాలు...

* వయసు ముందుకు వెళ్లిపోతున్నా...ఏ వయసు దగ్గర ఉండాలో అక్కడే ఉంటారు. అంగుళమైనా కదలరు.
* వీధుల్లో నడుస్తున్నప్పుడు సూటిగా నడవడం తప్ప చుట్టూ చూడరు. ఎవరైనా పురుషుడు పలకరింపుగా నవ్వినా స్పందించరు.
* ఇంటి బాగోగుల కోసం ఎంతో పని చేస్తారు. పాపం...గుర్తింపును మాత్రం ఆశించరు.
* అశ్లీల సాహిత్యం జోలికి వెళ్లరు.
* అందచందాల కోసం బొటాక్స్ ఇంజెక్షన్‌లు వేయించుకోవడం, వాక్స్‌లు చేయించుకోవడం, వ్యాయామాలు చేస్తుంటారుగానీ... ఈ త్యాగాల గురించి ఎప్పుడూ ప్రస్తావించరు.
* మైకేల్ ఏంజిలో చిత్రాన్ని శ్రద్ధగా పెయింట్ చేస్తున్నట్లు, తమ ముఖాలను పెయింట్ చేసుకుంటారు.
*‘నేను ఎలా ఉంటాను? బాగుంటానా?’ లాంటి ప్రశ్నలు సాటి మహిళలను తప్ప మగవాళ్లను అడిగి ఇబ్బంది పెట్టరు.
* సమస్యలను తమదైన శైలిలో పరిష్కరిస్తారు. అవి ఒక పట్టాన మగవాళ్లకు అర్థం కావు.
* పురుష దుస్తులతో కూడా ఆఫీసుకు వెళ్లగలరు. మరి మగవాళ్లు స్కర్ట్ ధరించి ఆఫీసుకు వెళ్లగలరా?
* ‘ఫలానా అమ్మాయి బాగుంది’ అని అంటే ‘మీ టేస్ట్ మీ ముఖం లాగే ఉంది’ అని మన టేస్ట్ తాలూకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు.
* సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోని ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement