అమర్త్య హెగ్డేతో డీకేశీ కుమార్తె నిశ్చితార్థం | DK Shivakumar Daughter Gets Engaged To CCD Founder VG Siddhartha Son | Sakshi
Sakshi News home page

కాఫీ డే సిద్ధార్థ కొడుకుతో డీకేశీ కుమార్తె నిశ్చితార్థం

Published Wed, Jun 17 2020 7:49 PM | Last Updated on Wed, Jun 17 2020 8:12 PM

DK Shivakumar Daughter Gets Engaged To CCD Founder VG Siddhartha Son - Sakshi

బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, వరుడి తాతయ్య ఎస్‌ఎం కృష్ణ ​నివాసంలో ఈ వేడకను నిర్వహించారు. కాగా డీకేశీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అమర్త్య సైతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.

కాగా 2019 జూలైలో అదృశ్యమైన కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ.. ఆ తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో శవమై కనిపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇక ప్రస్తు‍తం వారి వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవిక నిర్వహిస్తున్నారు. కాగా సిద్ధార్థ, శివకుమార్‌ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందని వారి సన్నిహితులు తెలిపారు. (వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement