బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది జూలైలో ఆయన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కాఫీడే బోర్డు దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్ కాఫీ డే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి లెక్కలు తేలలేదని తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే ఈ నివేదికను బయటపెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా సిద్దార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లు ఒక లేఖ బయటపడిన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్
'అందులో ఓ పారిశ్రామిక వేత్తగా తాను విఫలమయ్యానని, కంపెనీ ప్రతి ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యత అని తెలిపారు. తాను నిర్వహించిన లావాదేవీల వివరాలు కాపీ డే బోర్డు, ఆడిటర్లు , సీనియర్ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియదని' అందులో పేర్కొన్నారు.తాజాగా కాఫీ డే బోర్డు జరిపిన దర్యాప్తులో వందల కొద్ది లావాదేవీలను కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డే, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు. కాగా.. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ?
Comments
Please login to add a commentAdd a comment