
సాక్షి, మైసూరు: కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ సిద్ధార్థ ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు.
వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ముందు ఆయన తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో గంగయ్య హెగ్డేకు కుమారుడు ఆత‍్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment