ఈ ‘సిద్ధార్థ’ చాలా పవర్‌ఫుల్
‘‘బుల్లితెర స్టార్‌గా పేరున్న ఆర్.కె. నాయుడు వెండితెరపైనా బాగా రాణిస్తాడు. ఈ ‘సిద్ధార్థ’ కథ చాలా పవర్‌ఫుల్. ఈ సినిమా అందరి కెరీర్‌నూ మలుపు తిప్పుతుంది’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అన్నారు. ఆర్.కె. నాయుడు, సాక్షి చౌదరి, రాగిణీ నంద్వాని కాంబినేషన్‌లో దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సిద్ధార్థ’. శనివారం దాసరి కిరణ్ పుట్టినరోజు వేడుకను హైదరాబాద్‌లో యూనిట్ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, మణిశర్మ, ఎస్.గోపాలరెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి, విస్సు, బి. కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.